జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ భూముల రీ సర్వేను ఈనెలాఖరునాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసారు. పాడేరు రెవెన్యూ డివిజన్లో మండలానికి రెండు గ్రామాలను పైలట్ గ్రామాలుగా తీసుకుని సర్వే చేస్తున్నామన్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 375 గ్రామాల్లో సర్వే పూర్తి చేసారని రికార్డు వర్కు పూర్తి చేయాల్సి ఉందన్నారు. విలేజ్ సర్వేయర్ల లాగిన్లో 89, వి ఆర్ ఓల లాగిన్ లో 141, డిప్యూటీ తాహశీల్దార్లు లాగిన్ లో 15, తాహశీల్దార్లు లాగిన్ లో 78 పెండింగ్లో ఉన్నాయన్నారు. గ్రామ సభలు నిర్వహించి 13 నోటిఫికేషన్ జారీ చేయాలని అన్నారు. భూ రికార్డుల క్రమబద్దీకరణ, వెక్టరైజేషన్ త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పారు. అవసరమైన చోట మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. సర్వే పూర్తి చేయక పోతే గ్రామ సర్వేయర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు సర్వే చేయడం సర్వే చేయడానికి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రామంలో ఎవరు సర్వే చేసారో విచారించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోపాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు కె. దేవేంద్రుడు, 11 మండలాల మండల సర్వేయర్లు, సర్వే డిప్యూటీ తాహశీల్దారులు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.