మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 27:
సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేసేవిధంగా టౌన్‌ప్లానింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే..! విద్యాశాఖ అధికారులు లంచాలకు అలవాటు పడి, విధులు తాకట్టు పెడుతున్నారు.. మున్సిపల్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు..! ఫైర్ ఎన్‌వోసి లేకుండానే పాఠశాల నిర్వహణపై విద్యాశాఖ అవగాహన రాహిత్యంతో బరితెగించి సహకరిస్తున్నారు..దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ గ్రామంలోని కన్జర్వేషన్ జోన్‌లో "వ్యాసా స్కూల్" నిర్వహణపై స్థానికులు ఫిర్యాదు చేసినా, పత్రికల్లో వార్తలు వచ్చినా చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారు.. నిర్మాణ అనుమతులకు అవకాశం లేని..! కన్‌జర్వేషన్ జోన్ వ్యవసాయ భూమిలో "వ్యాసా స్కూల్" యాజమాన్యం విద్యార్థులను ప్రమాదంలో పెడుతున్నారు..గతంలో బౌరంపేట్ వాసులు ఫిర్యాదు చేసి 4 నెలలు గడిచినా నేటికీ చర్యలు శూన్యం.. మరోవైపు వ్యాసా స్కూల్ యాజమాన్యం పత్రికల్లో వార్తలు రాసిన విలేఖరులపై కేసులు పెడతామని, ఇతర విలేఖరులతో బెదిరింపులకు పాల్పడే విధంగా చెప్పడం విశేషం..నిషేధిత స్థలం కన్జర్వేషన్ జోన్‌లో "వ్యాసా స్కూల్" అక్రమంగా నిర్వహిస్తుండటమే గాక, యాజమాన్యం బరితెగించి వ్యవహరించడం గమనార్హం..