పర్మిషన్‌లేని పాఠశాల అడ్మిషన్‌లకు..! తల్లితండ్రులదే బాధ్యత..!

దుండిగల్ విద్యాధికారి కృష్ణ బాధ్యతా రహితంగా సమాధానం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అవినీతి మయంగా అధికార యంత్రాంగం..

అలంకార ప్రాయంగా మారిన.. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు..

బౌరంపేట్‌ "నారాయణ హైస్కూల్" వ్యవహారంలో ఎంఇఓ నిర్లక్ష్య వైఖరి..

అక్రమ నిర్మాణంలో కమర్షియల్ కార్యకలాపాలపై కమిషనర్ ఉదాసీనత..

ప్రశ్నించినా నోరుమెదపని పట్టణ ప్రణాళిక అధికారి..! కమిషనర్ సైలెంట్..!

 
తిలాపాపం తలాతలాపిడికెడుఅన్న చందంగా ముడుపులకే ప్రాధాన్యత..?

క్లాసులు మొదలైన తరువాతే చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పిన ఎంఇఓ..


రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో..! కమర్షియల్ కార్యకలాపాలు..

అనుమతుల్లేని నారాయణ హైస్కూల్ ఏసీ క్యాంపస్‌ పనులపై విద్యాధికారి నిర్లక్ష్యం..

కార్పోరేట్ విద్యాసంస్థలకు.. కొమ్ముకాస్తున్న మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు.. 

 

నిబంధనలు పాటించని అక్రమ రెసిడెన్షియల్ భవనంపై దుండిగల్‌ మున్సిపల్ అలసత్వం..

పాఠశాలకు అనుమతులు లేవని చెబుతున్న దుండిగల్‌ విద్యాధికారి చర్యలకు జాప్యం..

*కార్పోరేట్ విద్యాసంస్థ నారాయణ యాజమాన్యానికి అండగా ఎంఇఓ..

అక్రమ నిర్మాణ దారునికి అండగా దుండిగల్‌ కమిషనర్ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారి..

మామూళ్ళ మత్తులో దుండిగల్‌ మున్సిపల్  అండ్ విద్యాశాఖ అధికారి..?

విద్యార్ధులను ప్రమాదంలో పెడుతున్న రెండు శాఖల అధికారులు..

నారాయణ విద్యాసంస్థ లోగో పూర్తిచేశారని చెప్పగా, ఎంఇఓ హాస్యాస్పద సమాధానం..

దుండిగల్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..! విద్యాశాఖ అధికారి అలసత్వంతో..! విద్యార్థులను ప్రమాదంలో పెడుతున్నారు.. ఈ రెండు శాఖల అధికారులు లంచాలకు అలవాటుపడి బహిరంగంగానే సహకరించడం పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్ళినా..! సెటిల్మెంట్‌లు చేసుకుని చర్యలకు దూరంగా ఉంటుండగా..! అక్రమ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న అనుమతుల్లేని నారాయణ హైస్కూల్‌కి, మేడ్చల్ జిల్లా డిఈఓ, దుండిగల్‌ విద్యాధికారి(ఎంఇఓ) చర్యలు తీసుకోకుండా మామూళ్ళతో సరిపెడుతున్నారని స్పష్టమవుతుంది.. అక్రమ అపార్ట్‌మెంట్‌పై వార్తలు వచ్చినా అక్రమార్కులను ప్రోత్సహిస్తున్న దుండిగల్‌ మున్సిపల్ అధికారులు.. అనుమతుల్లేని నారాయణ హైస్కూల్‌‌లో "అడ్మిషన్‌లకు" దుండిగల్‌ విద్యాధికారి కీలక పాత్రపోషిస్తున్నారు.. రెండు సార్లు నారాయణ స్కూల్ వద్దకు వెళ్ళి చర్యలు తీసుకుంటామని చెప్పిన దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ ఇప్పుడు మాటమార్చి అడ్మిషన్‌లు తమకు సంబంధం లేదని, సమధానం చెప్పడం వెనుక..! భారీగా ముడుపులు ముట్టి ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..*

*మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 18:*

తెలంగాణ రాష్ట్రం ఏ ముహుర్తాన ఆవిర్భవించిందో కానీ..! అవినీతి అధికారులకు పట్టంకట్టే విధంగా తయారైందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. బడాబాబులకు, బలిసినోళ్ళకు, కార్పోరేట్ సంస్థలకు సహకరించడమే ధ్యేయంగా కొందరు అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు.. మరోవైపు రోజుకో కేసునమోదు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల చర్యలు కూడా కేవలం ఉనికిని చాటుకునే విధంగానే ఉంటున్నాయని ప్రజల్లో అసహనం మొదలైంది.. "తిమింగళాల"ను వదిలేసి "పిత్తపరకల"కు వలేస్తున్నారని స్పష్టమవుతుంది.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, రెవెన్యూ, విద్యాశాఖల పాత చట్టాల అమలు సంగతి దేవుడెరుగు..! రాష్ట్రం ఏర్పాటు అనంతరం అమలు చేసిన చట్టాలను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నట్లు తేటతెల్లం చేస్తుంది.. దుండిగల్‌ మున్సిపల్  మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో "టిజి-బిపాస్" చట్టానికి తూట్లు పడుతుండగా..!  "మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారిని, దుండిగల్‌ విద్యాధికారి అలసత్వం పతాకస్థాయికి చేరుకుంది.. ఈ రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యం అవినీతికి అద్దం పడుతుంది.. అక్రమ నిర్మాణ దారులతో మున్సిపల్ సెటిల్మెంట్‌లు..? అనుమతులు లేని కార్పోరేట్ విద్యాసంస్థలతో  విద్యాశాఖ అధికారులు చేతులు కలిపి..! అనుమతుల్లేని కార్పోరేట్ విద్యాసంస్థ పాఠశాలకు అడ్మిషన్‌ల పేరుతో లక్షల రూపాయలు వసూళ్ళు చేస్తున్నారు.. "టిజి-బిపాస్" నిబంధనలు పాటించని అక్రమ భవనంలో.. విద్యాశాఖ అనుమతి తీసుకోకుండానే, నారాయణ హైస్కూల్‌కి అడ్మిషన్‌లు తీసుకోవడం విశేషం.. మరోవైపు శరవేగంగా నారాయణ ఏసీ క్యాంపస్ పనుల నిర్వహణపై చర్యలు శూన్యం.. ఈ అక్రమ అడ్మిషన్‌లలో మేడ్చల్ జిల్లా విద్యాధికారులకు వాటాలు వెళ్తున్నాయని ఆరోపణలు లేకపోలేదు.. అటు ప్రజలని, ఇటు విద్యార్థులను రిస్కులో పెడుతున్న మున్సిపల్, విద్యాశాఖ అధికారుల తీరుపై "పెన్ పవర్" ప్రత్యేక కథనం..

*అక్రమ భవనంపై చర్యలేవి కమిషనర్ సారూ..?*

దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ లహరి గ్రీన్‌పార్క్ రోడ్డులోని రెసిడెన్షియల్ అనుమతులతో నిర్మించిన బాస్కర్‌రెడ్డికి చెందిన, అపార్ట్‌మెంట్‌‌‌లో కమర్షియల్ కార్యకలాపాలు ఎలా సాధ్యం..! అదే అపార్ట్‌మెంట్‌లో జీవో నెంబర్ 168 ను అతిక్రమించి సెట్‌బ్యాకుల్లో వాచ్‌మెన్ రూము  నిర్మాణంపై మున్సిపల్ అధికారుల వాటా ఎంత..? వార్తలు వస్తే చర్యలు తీసుకోకుండా పైనుండి ప్రెజర్ ఉందని చర్యలకు దూరం ఉండటంలో ఆంతర్యం..? టిజి-బిపాస్ చట్టాన్ని అమలు చేస్తున్నారా..? నిర్వీర్యం చేస్తున్నారా..? అక్రమ నిర్మాణ దారులకు సహకరించడమే మున్సిపల్ అధికారుల పారదర్శకత విధులా..? అధికారుల వసూళ్ళకు అడ్డాగా మారిన దుండిగల్‌ మున్సిపల్ కార్యాలయంపై..! మేడ్చ
 మేడ్చల్ జిల్లా లోకల్‌బాడీ అదనపు కలెక్టర్ నిర్లక్ష్యం దేనికి సంకేతం..? అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నట్టా..?

*దుండిగల్‌ ఎంఇఓ హాస్యాస్పద సమాధానం..*

అక్రమ నిర్మాణంలో అనుమతుల్లేని నారాయణ పాఠశాల నిర్వహణపై, దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ హాస్యాస్పద సమాధానం.. సంబంధిత విద్యాధికారికి అవగాహన లేకపోగా.. ప్రశ్నించిన విలేఖరులను తప్పుదోవ పట్టించే విధంగా సమాధానం చెప్పడం విశేషం.. కార్పోరేట్ విద్యాసంస్థ నారాయణ హైస్కూల్‌కి అనుమతులు లేవని, తను బాధ్యతలు చేపట్టిన నాటినుండి, సుమారు ఏడాది నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పిన దుండిగల్‌ ఎంఇఓ కృష్ణ.. బోర్డు తీసేయ్, స్కూల్ మూసేయాలని నారాయణ పాఠశాల నిర్వహకులను హెచ్చరించినట్లు "పెన్ పవర్" ప్రతినిధితో తెలిపిన ఎంఇఓ..! తాజాగా అడ్మిషన్‌ల బాధ్యత తల్లిదండ్రులదేనని హాస్యాస్పద సమాధానం చెప్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.. విద్యాశాఖ అధికారులకు కార్పోరేట్ విద్యాసంస్థ నుండి కార్యం సిద్దించినట్లు వ్యవహరిస్తున్నారు.. అక్రమ అడ్మిషన్‌ల విషయంలో తల్లిదండ్రులదే బాధ్యత అంటూ చెబుతూనే..! బోర్డు తొలగించడం, తరగతులు నిర్వహించకుండ చూడటం వరకే తమ బాధ్యత అని దుండిగల్‌ విద్యాధికారి చెప్పడం విశేషం..

*ఏదిఏమైనప్పటికీ బౌరంపేట్ లహరి గ్రీన్‌పార్క్ రోడ్డులోని అక్రమ కట్టడానికి మున్సిపల్ అధికారులకు..! అదే అక్రమ కట్టడంలో పర్మిషన్ లేకుండా నారాయణ హైస్కూల్‌కి, విద్యాశాఖ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని, చర్యల్లేని వారి విధులతో స్పష్టమవుతుంది.. మరోవైపు దుండిగల్‌ విద్యాధికారి అక్రమ పాఠశాల సందర్శన సమయంలో బిల్డింగ్‌పై "నారాయణ సంస్థ లోగో పెయింట్ ప్రారంభ దశలో ఉండగా.. ఎంఇఓ పరిశీలించిన తర్వాత లోగోను పూర్తిచేశారు.. అదే విషయాన్ని దుండిగల్‌ ఎంఇఓ కృష్ణతో పెన్ పవర్ ప్రతినిధి ప్రస్తావించగా..! ముడుపులు తీసుకున్నట్లు వ్యవహరిస్తూ..! ఎంఇఓ పొంతనలేని సమాధానం చెప్పడం గమనార్హం..*

*రెసిడెన్షియల్ అనుమతుల అపార్ట్‌మెంట్‌.. విద్యాసంస్థ కమర్షియల్ కార్యకలాపాలకు అద్దెకిచ్చారు.. సింగిల్ ఎగ్జిట్ ఉన్న భవనంలో ప్రమాదకరంగా నారాయణ ఏసీ క్యాంపస్ పనులు..అక్రమంగా అడ్మిషన్‌లు, అధికారులకు వాటాలు..? మున్సిపల్ అండ్ విద్యాశాఖ చేతివాటానికి బౌరంపేట్ లహరి గ్రీన్‌పార్క్ రోడ్డులోని బాస్కర్‌రెడ్డి అపార్ట్‌మెంట్‌ ఒక నిదర్శనం.. పైనుండి ప్రెజర్ ఉందంటున్న మున్సిపల్ కమిషనర్‌కి, టిజి-బిపాస్ చట్టం కంటే, పైనుండి వచ్చే ప్రెజర్స్‌నే పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తున్న మున్సిపల్ అధికారులు.. బిల్డర్ రాజారెడ్డి ఫోన్‌కాల్‌తో, శాశ్వతంగా చర్యలకు స్వస్తి పలికినట్లు  స్పష్టమవుతుంది..*

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.