నటీనటులు: నవీన్ చంద్ర, సునైనా, కన్నా రవి, శ్రీకృష్ణ దయాళ్, మాలినీ జీవరత్నం, కుమారవేల్ తదితరులు
దర్శకుడు: జె ఎస్ నందిని
నిర్మాతలు: శుక్‌దేవ్ లాహిరి
సంగీత దర్శకులు: అశ్వత్
సినిమాటోగ్రాఫర్: బార్గవ్ శ్రీధర్
ఎడిటింగ్: సతీష్ సూర్య
ఇటీవల ఓటిటి కంటెంట్ గా మన సౌత్ నుంచి రానున్న ఓ సిరీస్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో ఆసక్తి రేపింది. నటుడు నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో నటించిన ఆ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నే “ఇన్స్పెక్టర్ రిషి”. తమిళ్ లో తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగు సహా పాన్ ఇండియా భాషల్లో ఇప్పుడు అమేజాన్ యాప్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ సిరీస్ ఓటిటి వీక్షకులని మెప్పించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.
స్టోరీ ;ఇక ఈ సిరీస్ కథలోకి వస్తే.. కోయంబత్తూర్ తేంకాడు అనే ఓ దట్టమైన అటవీ ప్రాంతమైన గ్రామంలో ప్రజలు అనుమానాస్పద రీతిలో మరణిస్తూ ఉంటారు. మరి మిస్టరీని ఛేదించేందుకు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రిషి నందన్(నవీన్ చంద్ర) అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అయ్యానార్ (కన్నా రవి), చైత్ర (మాలిని జీవరత్నం) లు రంగంలోకి దిగుతారు. మరి ఆ గ్రామంలో జరుగునున్న మిస్టరీ మరణాలు వెనుక ఉన్నది ఎవరు? ఆ అడవి ప్రజలు దేవతగా కొలిచే వనరాచినే ఇవన్నీ చేస్తుందా లేక అసలు కారణాలు ఏంటి? వీటికి ఓ పరిష్కారం దొరికిందా లేదా? రిషి ఇన్వెస్టిగేషన్ ని ఛేదించాడా అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.
హై మూమెంట్స్ :
ఈ సిరీస్ లో నటీనటులు మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించారు అని చెప్పాలి. మొదటిగా నవీన్ చంద్ర నుంచే చెప్పుకుంటే ఇప్పటికే తాను చాలా ఇంటెన్స్ పాత్రలు పోషించాడు. కొన్ని సిన్సియర్ అటెంప్ట్స్ లో ఈ రిషి రోల్ కూడా ఒకటని చెప్పాలి. తన కేసు విషయంలో కమిట్ అయ్యి ఎంత దూరమైనా వెళ్లగలిగే సిన్సియర్ పోలీస్ గా ఈ సిరీస్ లో తాను ఆకట్టుకుంటాడు.
అలాగే నటి సునైనా డీసెంట్ ప్[పాత్రలో కనిపిస్తుంది. ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా తనలోని లోతైన హావభావాలను వ్యక్తం చేసింది. ఇక వీరితో పాటుగా ఇతర ముఖ్య పాత్రధారులు మాలిని జీవరత్నం, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్ తదితరులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు.
లో మూమెంట్స్ :
ఈ సిరీస్ లో పెద్ద డిజప్పాయింటింగ్ అంశం ఏదన్నా ఉంది అంటే అసలు ఈ సిరీస్ కథాంశమే అని చెప్పాలి. చాలా రోటీన్ గా ఆల్రెడీ చూసినట్టుగానే ఈ సిరీస్ లో లైన్ అనిపిస్తుంది. ఒక ప్రాపర్ థ్రిల్లర్, హారర్ కానీ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇందులో అసలు ఏమాత్రం ఆకట్టుకోవు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ ఆసక్తిగా అనిపించి ఉండొచ్చు కానీ సిరీస్ చూస్తే అసలు వాటిలో మేటర్ లేదని అర్ధం అయ్యిపోతుంది.
ఇంకా ఈ సిరీస్ ని అనవసరంగా బాగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 5 ఎపిసోడ్స్ అయితే దారుణంగా సాగదీశారు. వీటితో చూసే ఆడియెన్స్ కి బాగా బోర్ అనిపిస్తుంది. అలాగే ఈ ఒక్క సిరీస్ ని కంప్లీట్ చెయ్యడానికి 8 గంటలు సమయం కేటాయించాలి. కానీ మొత్తం చూసాక ఈ సమయమంతా వృధా అనిపించక మానదు.
అలాగే హారర్ ఎలిమెంట్స్ ఏమాత్రం మెప్పించవు ఆల్రెడీ చూసేసినట్టుగానే అనిపిస్తాయి దీనితో అసలు కొత్తదనం కనిపించదు. సస్పెన్స్ ఫ్యాక్టర్ మైంటైన్ చేయడంలో కూడా ఈ సిరీస్ విఫలం అయ్యింది.
వీటితో పాటుగా కొన్ని సీన్స్ లో అసలు నేటివిటీ మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. జెనరల్ గా డబ్ వెర్షన్ లో ఆయా నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు ఉండాలి కానీ డబ్బింగ్ వెర్షన్ లో కూడా ఒరిజినల్ వెర్షన్ ని ఉంచేశారు. ఇక ఈ సిరీస్ లో ఎక్కువ పాత్రలు వాటి సబ్ ప్లాట్ లు లాంటివి మరింత నీరసం తెప్పిస్తాయి.
సాంకేతిక నైపుణ్యం :
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి. మెయిన్ గా ఆర్ట్ వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. పలు సెట్టింగ్స్ నాచురల్ విజువల్స్ బాగున్నాయి. టెక్నీకల్ టీం లో మ్యూజిక్ వర్క్ బాగాలేదు. ఈ తరహా సిరీస్ లకి ప్రభావవితం చేసే నేపథ్య గీతం ముఖ్యం అది ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ లో చాలా సీన్స్ కట్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ ని ఇంకా బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకులు జే ఎస్ నందిని విషయానికి వస్తే.. తాను ఏదో అనుకోని థ్రిల్ చేయడానికి ట్రై చేసిన ఈ సిరీస్ లో అది తప్ప అనవసర అంశాలు ఎక్కువయ్యిట్టుగా అనిపిస్తుంది. వీటితో తన వర్క్ ఈ సిరీస్ కి నిరాశపరుస్తుంది. చాలా వీక్ కథా, కథనాలతో తాను ఈ సిరీస్ ని డల్ గా నడిపించారు.
రేటింగ్ :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఇన్స్పెక్టర్ రిషి” లో నవీన్ చంద్ర మరోసారి నటుడుగా ఆకట్టుకుంటాడు అలాగే తనతో పాటుగా ఇతర పాత్రధారులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు కానీ అల్టిమేట్ లో సిరీస్ లో విషయంలో తేలిపోయింది. దీనితో కొందరిలో అయినా మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సిరీస్ ఓవరాల్ గా బాగా డిజప్పాయింట్ చేస్తుంది. సరైన కథా, కథనాలు సిరీస్ లో లోపించాయి. వీటితో ఈ సిరీస్ కి దూరంగా ఉండడమే మంచిది
PEN POWER RATING-2.5/5