డ్రాగన్ ను అడగడుగునా అడ్డుకుంటూ....

locking-the-dragon-everywhere

భారత్‌కు దాయాది దేశం పాకిస్తాన్‌ తలనొప్పిగా మారింది. ఉగ్రవాదులను, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ భారత్‌లో అలజడికి ప్రయత్నిస్తోంది. ఐదేళ్లుగా మరో పొరుగు దేశం చైనా కూడా తన చర్యలతో భారత్‌ను కవ్విస్తోంది. తరచూ సరిహద్దులు మారుస్తూ.. మ్యాప్‌లు విడుదల చేస్తోంది. గాల్వన్‌లో అయితే చొరబాటుకు ప్రయత్నించింది. భారత సైన్యం దానిని తిప్ప కొంట్టింది. అప్పటి నుంచి చైనా భారత్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి భారత్‌ను కవ్విస్తోంది. దీంతో మోదీ కూడా చైనాకు చెక్‌ పెట్టే చర్యలు మొదలు పెట్టారు.

పలు చైనా యాప్‌లను బ్యాన్‌ చేసి కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టాడు. చైనా తయారీ వస్తువుల దిగుమతిపై ట్యాక్స్‌లు పెంచారు. చాలా వరకు దిగుమతులు తగ్గించారు. ఈ నేపథ్యంలో చైనా దొడ్డిదారిన భారత్‌పై నిఘా పెడుతోంది. మనతో సన్నిహితంగా ఉండే, శ్రీలంక, మాల్దీవులను మచ్చిక చేసుకుని సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది. ఇక భారత సరిహద్దుల్లో అనేక నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా చైనా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది.పొరుగు దేశాలపై నిఘా కోసం చైనా ప్రత్యేకంగా బెలూన్లు తయారు చేసి వినియోగిస్తోంది. తాజాగా ఈ బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన దృష్టిపెట్టింది. దాదాపు 15 కిలోవిూటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువులను కూల్చడంపై ఎయిర్‌ఫోర్స్‌ కమాండోలకు శిక్షణ ఇచ్చింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్లను కూల్చే ఆపరేషన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు పేలోడ్‌ను కూడా అమర్చారు. దీనిని 55 వేల అడుగుల ఎత్తులో ఒక క్షిపిణిని ప్రయోగించి కూల్చేశారు. దీంతో గగనతలంల నిదానంగా కదిలే భారీ టార్గెట్లను కూడా కూల్చే సత్తాను భారత్‌ ఏర్పాటు చేసుకుంది.ఇక డ్రాగన్‌ కంట్రీ చైనా 2023 నుంచి నిఘా బెలూన్లను ప్రయోగిస్తోంది. అమెరికాలో దక్షిణ కరోలినా గగనతలంల ఓ నిఘా బెలూన్‌ ప్రత్యక్షమై సంచలనం సృష్టించింది. నాడు అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌?22 సాయంతో దీనిని కూల్చారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు కనిపించాయి. భారత్‌లో కూడా త్రివిద దళాల కమాండ్‌ ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులపైనా కనిపించాయి. మరో వైపు క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్‌, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్‌, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమ్మిట్‌ కొనసాగింది. పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి.సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్‌ ఓపెన్‌ ఇండో`పసిఫిక్‌ రీజియన్‌ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు.ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు, ఘర్షణలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్వాడ్‌ సదస్సు ఏర్పాటు కావడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం, వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కారించుకోవడానికి చర్చలే శరణ్యమని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్యం, సమ్మిళిత, సుసంపన్నమైన ఇండో`పసిఫిక్‌ రీజియన్‌ను నెలకొల్పుకోవాలనేదే క్వాడ్‌ భాగస్వామ్య దేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మిగిలిన దేశాలకు క్వాడ్‌ ఓ దిక్సూచిగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం జో బైడెన్‌, మోదీ, ఆంటోనీ అల్బెనీస్‌, ఫ్యుమియో కిషిడ.. జాయింట్‌ స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు.దక్షిణాసియా రీజియన్‌లో తరచూ సరిహద్దు జలాల్లోకి ప్రవేశిస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తెర విూదికి తీసుకుని రావాలని నిర్ణయించారు. క్వాడ్‌ అట్‌ సీ షిప్‌ అబ్జర్వర్‌ మిషన్‌కు రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు. యూఎస్‌ కోస్ట్‌ గార్డ్‌, భారత్‌ కోస్ట్‌ గార్డ్‌, జపాన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఆస్ట్రేలియన్‌ బోర్డర్‌ ఫోర్స్‌కు ఇందులో భాగస్వామ్యాన్ని కల్పిస్తారు.తీర ప్రాంతాల సరిహద్దు జలాల భద్రత కోసం ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం అనేది ఇదే తొలిసారి.ఇంటర్‌ ఆపరేబిలిటీని మెరుగుపరచడం, సముద్ర జలాల భద్రతను మరింత పటిష్ట పర్చడం, ఇండో`పసిఫిక్‌ రీజియన్‌ పరిధిలో మున్ముందు మరిన్ని జాయింట్‌ ఆపరేషన్‌/మిషన్‌లను చేపట్టాలని నిర్ణయించారు.క్వాడ్‌ భాగస్వామ్య దేశాల మధ్య ఎయిర్‌లిఫ్ట్‌ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కొత్తగా క్వాడ్‌ ఇండో`పసిఫిక్‌ లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. సీ లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ను ఈ రీజియన్‌ అంతటా మరింత వేగంగా విస్తరింపజేయడానికి క్వాడ్‌ పోర్ట్స్‌ ఆఫ్‌ ది ఫ్యూచర్‌ పార్టనర్‌షిప్‌కు నాంది పలికారు. భారత్‌ చైనాకు చెక్‌ పెట్టేలా గగణతలంలో పేల్చే పరిజ్ఞానం సొంతం చేసుకుంది.

About The Author: Admin