నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ జోగినాధునిపాలెంకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ వర్రే శ్రీనివాసరావు అతని అనుచరులతో కలిసి గురువారం జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర వారందరికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ పార్టీ సిద్దాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. గత స్థానిక సంస్థలలో ఎన్నికల సమయంలో కౌన్సిలర్ సీటు కేటాయింపు విషయంలో తనకు అన్యాయం జరిగిందని భావించారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన అనుచరుచరుల నిర్ణయం మేరకు జనసేనలో చేరినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, నియోజకవర్గ ఎస్సీ సెల్ కన్వీనర్ డాక్టర్ కోన నారాయణరావు, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, సీనియర్ నాయకులు రేగబళ్ల శివ, కొత్తకోట రామశేఖర్ , మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, మాకవరపాలెం అధ్యక్షులు సేనాపతి శేషు, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు మోపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.