చార్జర్ కోసమే.. చంపేశాడు..

ప్రెస్‌మీట్‌లో మేడ్చల్ డీసీపి కోటిరెడ్డి..

48 గంటల్లో నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించిన పోలీసులు..

సీసీటీవి పుటేజ్ ఆధారంగా నిందితుడు రావుల కమల్ కుమార్‌గా గుర్తింపు..

దుండిగల్‌ పియస్ పరిధి దుండిగల్‌ తాండా-2 లో శుక్రవారం గిరిజన మహిళ హత్య..

తండా-2లో పాలు, కల్లు మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మృతురాలు శాంత (50)..

సెల్‌ఫోన్ చార్జర్ కోసం ఇరువురి నడుమ గొడవ.. అసభ్య పదజాలంతో దూషించిన శాంత..

కోపంతో గిరిజన మహిళను కొట్టి తోసివేయగా కిందపడి తలకు బలమైన గాయం..

గాయంతో అరుస్తుండగా నిందితుడు కమల్ కుమార్ నోరు మూయడంతో ఊపిరాడక శాంత మృతి..

నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించి, సోమవారం రిమాండ్‌కు తరలింపు..

దుండిగల్‌ పియస్‌లో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పత్రికా సమావేశం..

 

దుండిగల్‌, పెన్ పవర్, ఆగష్టు 26:

సెల్‌ఫోన్ చార్జర్ కోసం గిరిజన మహిళను చంపేసిన ఘటన దుండిగల్ పియస్ పరిదిలో చోటుచేసుకుంది.. దుండిగల్ పియస్ పరిధిలో గత శుక్రవారం గిరిజన మహిళ హత్యకేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు.. డాగ్ స్క్వాడ్ మృతురాలి బంధువు చుట్టూ తిరిగి అనుమాస్పదంగా ఉన్నప్పటికీ.. లోతుగా దర్యాప్తు నిర్వహించగా అసలు నిందితున్ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి విచారించారు..
మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి పత్రికా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పియస్ పరిది దుండిగల్ తండా 2 లో పాలు, కల్లు మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపు నిర్వహిస్తున్న శాంత (50) శుక్రవారం ఉదయం తన దుకాణం ప్రక్కన విగతజీవిగా పడిఉండడం గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో..! డీసీపి, ఏసిపీ, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్య చేసినట్లు గుర్తించారు.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి 48 గంటల్లోనే కేసును ఛేదించారు.. సీసీటీవి పుటేజ్ ఆధారంగా నిందితుడు రావుల కమల్ కుమార్‌గా(37) గుర్తించి విచారణ చేపట్టారు..
నిందితుడు తాండ-2 సమీపంలోని "ఆల్ట్రాక్లీన్ సర్వీసెస్ కంపెనీలో" మెయింటెనెన్స్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలిందని డీసీపి కోటిరెడ్డి ప్రెస్‌మీట్‌లో తెలిపారు.. గాగిల్లాపూర్ ఎక్స్ రోడ్డువద్ద  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.. నిందితుడు కమల్ కుమార్ మృతురాలితో మొబైల్ చార్జర్ కోసం గొడవపడ్డాడని.. మృతురాలు శాంత అసభ్య పదజాలంతో దుర్బాషలాడడంతో నిందితుడు కొట్టి వెనక్కి తోయడంతో కిందపడి తనవెనక భాగంలో బలమైన గాయంతో ఆమె అరుస్తుండటంతో భయంతో ఆమె నోరు ముక్కు మూసివేశసాడని,శాంత ఊపిరి ఆడక  మరణించిందని అంగీకరించడంతో నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు మేడ్చల్ డి.సి.పి కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు..ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస రెడ్డి, సిఐ పి.సతీష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎస్. సతీష్, ఎస్ఐ ఎస్.శంకర్‌లను డిసిసి కోటిరెడ్డి అభినందించారు.. 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.