నర్సీపట్నం, పెన్ పవర్ :
జగన్ కి ఓటేస్తే పెన్షన్లు ఆపేస్తారా అంటూ గొలుగొండ మండలం పాకలపాడు క చెందిన 23 మంది దివ్యాంగులు అధికారులను ప్రశ్నించారు. సోమవారం ఉదయం స్పందనలో పిర్యాదు చేసేందుకు పాకలపాడు సర్పంచ్ రాజాన పద్మ, యాళ్ళ నాయుడు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. స్పందన కార్యక్రమం ఈరోజు రద్దు కావడంతో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాదితులు మీడియాతో మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షలతోనే మాకు పెన్షన్లు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.