పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎన్నారై వాసవీ అసోసియేషన్

41500/- అందజేసిన వెలగా నారాయణరావు

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురంకు చెందిన ఓ పేద కుటుంబానికి ఎన్నారై వాసవి అసోసియేషన్ అండగా నిలిచింది. శివపురానికి చెందిన గొల్లపూడి పెద్దన్న శెట్టి సైకిల్ పై సమోసాలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఈయన భార్య సావిత్రి క్యాన్సర్ వ్యాధితో మంచాన పడింది. ఒకపక్క వైద్యం,  మరో పక్క కుటుంబ పోషణ ఆర్థికంగా నానా ఇబ్బందులు పడ్డారు. చివరకు సరైన వైద్యం అందక సావిత్రి మృతి చెందింది. పెద్దన్న శెట్టికి కుటుంబ పోషణ భారం కావడంతో ఆ వార్డు టిడిపి నాయకుడు పైన గోవిందరావుకు తన బాధను చెప్పుకున్నారు. గోవిందరావు తన వంతు సహాయం చేయడమే కాకుండా, ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యుడైన వెలగ నారాయణరావు దృష్టికి తీసుకువెళ్లారు.  నారాయణరావు అమెరికాలోని అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. తొలి విడతగా 41500/- ఆర్థిక సాయం పంపించారు. ఈ సొమ్మును శుక్రవారం పైల గోవిందరావు, వెలగ నారాయణరావులు ఆ కుటుంబానికి అందజేశారు. కష్టాలలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులందరికీ రుణపడి ఉంటానని పెద్దన్న శెట్టి కృతజ్ఞతలు తెలిపారు.

About The Author: SIVAKUMAR.L