నర్సీపట్నం, పెన్ పవర్
నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం నాతవరం మండలం గాంధీనగరం నుండి 25 కుటుంబాలు వైసీపీలోకి చేరాయి. పెద్దబొడ్డేపల్లి క్యాంప్ కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వీరందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన సందర్భంగా వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే మడమ తిప్పని మనిషని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని భావించి పార్టీలో చేరామన్నారు. కులం, మతం, రాజకీయాలు చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు. జగన్ ను మళ్ళీ సిఎం చేయడం, నర్సీపట్నంలో ఉమాశంకర్ గణేష్ ను గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.