నర్సీపట్నం :
నర్సీపట్నం డిఎస్పీగా పోతిరెడ్డి శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇస్తూ ఉన్నతాధికారుల నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఆర్. మోహనరావుకు బదిలీ అయ్యింది. ప్రస్తుతం శ్రీనివాసరావు విజయనగరంజిల్లా, బొబ్బిలి డియస్పి గా పని చేస్తున్నారు. ఆయన పోలీస్ శాఖలో చేరిన తొలినాళ్ళలో నర్సీపట్నంలో పనిచేశారు. కోవిడ్ సమయంలోనూ రెడ్ జోన్ ఇంచార్జ్ గా పనిచేశారు. మరో రెండురోజుల్లో శ్రీనివాసరావు విధుల్లో చేరుతారు.