డౌనూరు చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ తో ఆటోలు, బస్సులు, జీపులు, ప్రయాణికుల లగేజీలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ రేవతమ్మ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనకు తనిఖీలు చేపట్టామన్నారు. మత్తు పదార్దాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. డబ్బుకు ఆశపడి యువత అక్రమరవాణాకు పాల్పడి, జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.