✒️ గంగులయ్య జనసేన నాయకుడా లేక పార్టీ కార్యకర్త..!
✒️ జిసిసి డైరెక్టర్ పదవి కేటాయింపుతో జనసైనికుల తీవ్ర ఆందోళన..!
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 22:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ కీలక నాయకుడిగా పేరుగాంచిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ పాడేరు అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్యకు గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ పదవిని ఉమ్మడి కూటమి ప్రభుత్వం కల్పించడంతో అల్లూరి జిల్లాలోని జనసేన పార్టీ నాయకత్వం పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి ఆందోళన నెలకొంది.జనసేన పార్టీ నాయకుడిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తృతంగా జనసేన పార్టీ ప్రచారం కోసం పార్టీ ఆశయాలను తప్పకుండా పనిచేస్తున్న గంగులయ్యను కావాలనే డైరెక్టర్ పదవిని కేటాయించి అవమానపరిచారని పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ జిల్లా స్థాయిలో బలోపేతం చేస్తూ ఇప్పటివరకు తన సొంత నిధులను ఖర్చు చేస్తూ పార్టీ అభివృద్ధికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్న గంగులయ్యను డైరెక్టర్ పదవి ప్రకటించి తీవ్రంగా అవమానపరిచారని ఇది తమను తీవ్రంగా బాధిస్తుందని పార్టీ కార్యకర్తలు నాయకులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఈ రోజున బలోపేతం కావడానికి గంగులయ్యే ముఖ్య కారణమని అటువంటి ప్రజా ఆదరణ పొందిన నాయకునికి జిసిసి డైరెక్టర్ పదవి కేటాయించి అవమానించేలా చేయటం బాధాకరమని పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జనసేన పార్టీ అధిష్టానం ఈ విషయంపై ఉమ్మడి కూటమి ప్రభుత్వంతో చర్చించి జనసేన పార్టీ అరకు పార్లమెంటు పాడేరు అసెంబ్లీ ఇన్చార్జ్ వంపురి గంగులయ్యకు నామినేటెడ్ పదవుల్లో కీలకమైన పదవి అందించే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్టానాన్ని పార్టీ నాయకులను అల్లూరి జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుతున్నా
రు.
స్టాప్ రిపోర్టర్ మాదిరి చంటిబాబు