స్టేట్ బ్యూరో పెన్ పవర్, హైదరాబాద్, అక్టోబరు16:
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్ ఒకటి. లోకల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ
ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా పని చేయాలని, రాబోయే ఎన్నికలలో మరింత గట్టిగా పని చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మెదక్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలని చెప్పారు. దీపాదాస్ మున్షి మాట్లాడుతూ, మెదక్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఉన్న జిల్లా అని అన్నారు. ఇక్కడ ఇందిరా గాంధీ గతంలో ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. ‘‘కార్యకర్తలకు మెదక్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉంది. మెదక్ జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. అక్కడ మనం చాలా కష్టపడి పని చేయాలి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మనం మంచి వ్యూహంతో పని చేయాలి. మంచి ఫలితాలు వచ్చేలా అందరూ క్షేత్రస్థాయిలో గట్టి పట్టుదలతో ముందుకు వెళ్లాలి’’ అని సూచించారు మున్షి.
మెదక్ పై దృష్టి...
a-view-of-medak
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్ ఒకటి. లోకల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మెదక్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచిన నేల కావడంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.