కాంగ్రెస్ కుటుంబ సభ్యుల.. ఆత్మీయ సమ్మేళనం..

కుత్బుల్లాపూర్, పెన్ పవర్, ఏప్రిల్ 14

ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కూనా శ్రీశైలంగౌడ్..!  ఆధ్వర్యంలో ఆత్మీయులతో సమావేశం..
ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్బంగా చిరకాల ఆత్మీయులతో సమావేశమయ్యారు.. ఆదివారం గాజులరామారం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శోభారాణి, టిపిసిసి ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతి రెడ్డి, కందాడి జోష్న శివారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, కూన శ్రీశైలం గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు..

తాను 27 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపరచిన అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కూన శ్రీనివాస్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్, సొంటి రెడ్డి పున్నారెడ్డి, కోలన్ గోపాల్ రెడ్డి, కోలన్ శ్రీనివాస్ రెడ్డి, కోలన్ రాజశేఖర్ రెడ్డి, బొంగునూరి కిషోర్ కుమార్ రెడ్డి, బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, ఆర్ లక్ష్మి, ఏనుగుల శ్రీనివాస్  రెడ్డి, గుంజ శ్రీనివాస్,  కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇంఛార్జ్ లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్‌యుఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.