గ్రామ కంఠంలో..! "ఒప్పంద" కూల్చివేతలా..?

పాక్షిక చర్యలతో..! "సయోధ్య" కుర్చుకుని..? వెనుదిరిగిన రెవెన్యూ, మున్సిపల్

మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్

చెప్పేవారు ఎన్ని చెప్పినా..! వినే వాళ్ళు వివరవంతులు కావలట..! ఈ నానుడి దుండిగల్‌ మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సరిగ్గా సరిపోతుంది.. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసిన వారిని, ప్రజలను, పత్రికల్లో వార్తా కథనాలు రాసిన వారిని ఏవిధంగా భావిస్తున్నారో కానీ..!అధికారులు అవగాహనా రాహిత్యంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతుంది.. ఉదాహరణకు దుండిగల్‌ చిన్నదామెర చెరువు 8.20 ఎకారల కబ్జా, అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చీవాట్లు పెట్టినట్లు అనధికారిక సమాచారం.. అయినా తీరు మారని మున్సిపల్, రెవెన్యూ అధికారులు.. బౌరంపేట గ్రామ కంఠంలో, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ అపార్ట్‌మెంట్‌ కూల్చివేతల్లో తమ చేతివాటం ప్రదర్శించినట్లు పాక్షిక కూల్చివేతలతో తేటతెల్లం అయింది..!

గ్రామ కంఠంలో..! "ఒప్పంద" కూల్చివేతలా..?


పాక్షిక చర్యలతో..! "సయోధ్య" కుర్చుకుని..? వెనుదిరిగిన రెవెన్యూ, మున్సిపల్..!

*దుండిగల్‌ మున్సిపల్ బౌరంపేటలో సుమారు 1800 గజాల గ్రామ కంఠంలో అక్రమ నిర్మాణాలు..
*స్థానికులు ఫిర్యాదులు..! వార్తా కథనాలు..!నోటీసుల డ్రామాతో భేరం..?
*తెరవెనుక నిజాంపేట్ కార్పొరేషన్‌కు చెందిన బీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధి ఉన్నట్లు ఆరోపణ..!
*దరఖాస్తు చేసుకోండి అనుమతులు జారీ చేస్తాం..? మున్సిపల్ అధికారులు చెప్పినట్లు సమాచారం..
*మొదటి నోటీసుకు నెలరోజుల వ్యవధి..! రెండవ నోటీసుకు 20 రోజుల వ్యవధి..
*కూల్చివేతలకు వెళ్ళి సయోధ్య కుదుర్చుకున్నట్లు సమాచారం..!

చెప్పేవారు ఎన్ని చెప్పినా..! వినే వాళ్ళు వివరవంతులు కావలట..! ఈ నానుడి దుండిగల్‌ మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సరిగ్గా సరిపోతుంది.. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసిన వారిని, ప్రజలను, పత్రికల్లో వార్తా కథనాలు రాసిన వారిని ఏవిధంగా భావిస్తున్నారో కానీ..!అధికారులు అవగాహనా రాహిత్యంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతుంది.. ఉదాహరణకు దుండిగల్‌ చిన్నదామెర చెరువు 8.20 ఎకారల కబ్జా, అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చీవాట్లు పెట్టినట్లు అనధికారిక సమాచారం.. అయినా తీరు మారని మున్సిపల్, రెవెన్యూ అధికారులు.. బౌరంపేట గ్రామ కంఠంలో, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ అపార్ట్‌మెంట్‌ కూల్చివేతల్లో తమ చేతివాటం ప్రదర్శించినట్లు పాక్షిక కూల్చివేతలతో తేటతెల్లం అయింది..!

మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్‌ 18:

అధికారులు ఎవరైనా అలంకార ప్రాయమే..! చర్యలు ఏవైనా అక్రమార్కులకు అనుకూలమే..! ఇది నగ్న సత్యం..! మేడ్చల్ జిల్లా దుండిగల్‌ మున్సిపల్ పరిధిలోని బౌరంపేట్‌ గ్రామ కంఠంలో అపార్ట్‌మెంట్‌ల  నిర్మాణాల వ్యవహారంలో..! "పిల్లి కళ్లు మూసుకుని.. పాలు త్రాగిన" చందంగా..! అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు స్పష్టమవుతుంది.. మున్సిపల్ పరిధిలో ఒక్కో గ్రామానికి చైన్‌మెన్‌లను నియమించారు..! బౌరంపేట్ గామానికి ఒక చైన్‌మెన్ ఉన్నాడు.. చైన్‌మెన్ సమాచారం తప్పకుండా ఉంటుంది.. అదీ కాకుండా అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఫిర్యాదులు..! వార్తాపత్రికల కథనాలతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం.. కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణకు ప్రత్యేక ఆలోచనా విధానాలతో ముందుకు వెళ్తారు.. వార్తలు ప్రచురించిన పత్రికలను బేరీజు వేసుకుని, ఉన్నతాధికారుల వరకు వార్తా కథనాలు వెళ్తాయా..? లేదా..? బేరీజులతో చర్యలు తీసుకోవడంలో దిట్ట.. ఇక రెవెన్యూ అధికారులు గ్రామ కంఠంలో నిర్మాణాలకు తమకు సంబంధం లేదని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది.. మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు తక్కువేమి లేరు.. కూల్చివేతలు ప్రారంభంలోనే‌ నిలిపివేసిన టిపిఎస్, జేసిబి సరిపోలేదని సాకు చెప్పడం గమనార్హం..

కూల్చివేతలకు యంత్రాలు సరిపోలేదట..!

యుద్దానికి వెళ్ళిన సైనికుడు "కత్తి డాల్" ఇంటివద్దనే మర్చిపోయి నట్లు ఉంది..! దుండిగల్‌ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంజునా సమాధానం..! మున్సిపల్ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ, టిపిఎస్ సంజునా..! ప్రశ్నించే వారిని గొర్రెలుగా భావిస్తారో ఏమో కానీ..! పొంతన లేని సమాధానంతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.. అక్రమార్కులకు సహకరించడానికి ఎంతకైనా తెగిస్తున్నారు.. బౌరంపేట్ బొడ్రాయి సమీపంలోని సుమారు 1800-2000 గజాల గ్రామ కంఠం స్థలంలో..! ఆరుగురు వ్యక్తులు కలిసి భారీ అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణంపై రెండు నెలలుగా, స్థానికుల ఫిర్యాదులతో..! పత్రికా విలేఖరులు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వివరణ కోరినప్పటికీ కాలయాపన చేశారు..  మొదటి నోటీసు "ఏడు రోజుల" వ్యవధికి గాను.. నెలరోజుల పైనే అవకాశం ఇచ్చినా అక్రమార్కుల నుండి సమాధానం లేదు..! "రెండవ నోటీసు" వ్యవధి 15 రోజులే అయినప్పటికీ..! అధికారుల ఉదాసీనతతో  20 రోజులకు పైగా సమయాన్ని కల్పించినా అక్రమ నిర్మాణదారుల నుండి ఎలాంటి సమాధానం రాలేదు.. 

ఇష్టంలేని చర్యలు..! ఇలాగే ఉంటాయి మరి..!

అధికారుల చర్యలకు అర్ధాలే వేరయా..! వేమన శతకం కాదు.. అధికారుల చేతివాటానికి ఇదో నిదర్శనం..! సంబంధిత అధికారులు ఈ పదాలు కొంచెం జీర్ణించుకోలేనివే..? అయినప్పటికీ పిల్లి పాలు త్రాగిన సామెతను ప్రతీచోట గుర్తు చేయలేం కాదా..! బౌరంపేట్ గ్రామ కంఠంలో అక్రమ నిర్మాణాల పాక్షిక కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ వ్యవహారంలో తెరవెనుక నిజాంపేట్ కార్పొరేషన్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ కీలక ప్రజాప్రతినిధి ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. తన దూతను కూల్చివేతల వద్దకు (అధికారుల) వద్దకు పంపించి మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం..! డబ్బంటే చేదెవరికి చెప్పండి..? ముందే అధికారులు కత్తి డాల్ లేకుండా చర్యలకు వెళ్ళారు..! దీనికి తోడు నిజాంపేట్ బీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధి ఇచ్చే ఆఫర్ ఎవరు కాదంటారు..? వెంటనే చర్యలకు ప్యాకప్ చెప్పడం వెనుదిరిగి వెళ్ళడం క్షణాల్లో ముగిసింది.. ఇష్టంలేని కూల్చివేతలు ఇలాగే ఉంటాయి మరి..!

బౌరంపేట్ కూల్చివేతలపై అధికారుల భిన్న స్వరాలు వినిపిస్తుండగా..! మున్సిపల్ కమిషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ ఫోన్ ఎత్తలేదు..! సమాధానం చెప్పలేదు..! మొదట టిపిఎస్ సంజునా ఎత్తకపోయినా..! కాసేపటికి ఫోన్ చేసి పొంతన లేని సమాధానం చెప్పారు.. నిలిచిపోయిన కూల్చివేతలపై ప్రశ్నించగా..! జేసిబితో చర్యలు తీసుకోలేక పోయామని, బ్రేకర్‌లు కావాలని టిపిఎస్ చెప్పడం విడ్డూరం.. అక్రమ నిర్మాణాన్ని చూడకుండానే నోటీసులు ఇచ్చారా..? అర్ధెకరంలో అపార్ట్‌మెంట్‌ కూల్చివేతకు కావల్సిన యంత్రాలపై టిపిఎస్‌కు అవగాహన లేదా..? లేక చర్యల సాకుతో "భేరం" కుదుర్చుకోవడానికి వెళ్ళారా..? గ్రామ కంఠంలో తమకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులు చెప్పడం..! అనుమతులకు దరఖాస్తు చేసుకోమని మున్సిపల్ అధికారులు సలహా  ఇవ్వడం..! ఇదంతా చూస్తుంటే కూల్చివేతలకు నోట్లకట్టలు అడ్డు పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు..

 

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.