నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..!

narayana-no-admissions-please

నారాయణా బోర్డు తీసేయ్.. స్కూల్ మూసేయ్:దుండిగల్ విద్యాధికారి..

బిల్డింగుకి "నో కమర్షియల్‌ పర్మిషన్.. స్కూలుకి నో పర్మిషన్..

అనుమతుల్లేని "నారాయణ హైస్కూల్‌లో"..! ఏసీ క్యాంపస్ పనులు..!

శుక్రవారం సంబంధిత పాఠశాలని సందర్శించిన "దుండిగల్‌ ఎంఈఓ"..

బోర్డుతీసేసి పాఠశాల మూసీవేయాలని నిర్వాహకులకు "ఎంఈఓ" హెచ్చరిక..

పేరెంట్స్ ఎవ్వరూ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి..

పర్మిషన్ లేని పాఠశాలల్లో..! అడ్మిషన్‌లు తీసుకోవద్దన్న దుండిగల్‌ విద్యాధికారి..

బౌరంపేట్‌‌లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్‌ యాక్టివిటీస్..

భవనానికే అర్హతలేదంటే..! మధ్యలో అనుమతిలేని "హైస్కూల్" నిర్వహణ..

ఎంఈఓ హెచ్చరికని బేఖాతర్ చేస్తూ శరవేగంగా "ఏసీ క్యాంపస్" పనులు..

పేరెంట్స్ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి..

నిబంధనలు పాటించనట్లయితే.! చట్టాలు అమలు దేనికి..?

అధికారుల అక్రమార్జనకు..?చట్టాలు అంటే అధికారిక ప్రభుత్వ పథకాలుగా భావించాలా?

టిజి-బిపాస్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న దుండిగల్ మున్సిపల్ అధికారులు..

అక్రమ కట్టడాలను రక్షించే దిశగా దుండిగల్‌ టౌన్‌ప్లానింగ్ అధికారుల ప్రయత్నం..?

అనుమతుల్లేని కార్పోరేట్ విద్యా సంస్థలను ప్రోత్సాహంచే విధంగా విద్యాశాఖ..? 

వార్తలు రాసిన పత్రికలపై అధికారులు విరుచుకు పడి బదనాం చేయడం కాదు..అక్రమ కట్టడాల పట్ల స్థానిక అధికారుల తీరును జిల్లా ఉన్నతాధికారులు, లోకల్‌బాడీ అదనపు కలెక్టర్ పరిశీలించాలి.. ప్రజా సేవకులుగా బాధ్యతగల అధికారులు..! అక్రమాలను ప్రోత్సహించడాన్ని ఏమంటారు..? పర్మిషన్‌లకు నిర్మాణాలకు పొంతన లేకపోయినా.! నిబంధనలు పాటించకుండా, ప్రమాదకర కట్టడాలు నిర్మిస్తుంటే.. అధికారుల చర్యలు, సిఫార్సుల వద్దనే స్తంభించి పోతున్నాయి..? టిజి-బిపాస్ చట్టం ఎందుకు..? ఎవరిని ఉద్దరించడానికి..? ఈ కార్యాలయాలు..! అధికారులు పేరుకేనా..? ఇదిలా ఉండగా..! మరోవైపు అక్రమ కట్టడాల్లో అనుమతులు లేకుండా కార్పోరేట్ విద్యాసంస్థల నిర్వహణ దేనికి సంకేతం..? విద్యాధికారి హెచ్చరికను కూడా లెక్క పట్టకుండా, దర్జాగా ఏసీ‌ క్యాంపస్‌ పనులు చేస్తున్నారంటే అధికారుల అండ లేకుండా సాధ్యమేనా..?

About The Author: Admin