కాంగ్రెస్‌పార్టీ పరువు తీస్తే..! ఉపేక్షించేది లేదు..

there-is-nothing-to-ignore-if-the-congress-party-is

గాగిల్లాపూర్ 214 కబ్జాలో కాంగ్రెస్ నాయకులు..! అన్న వార్తకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే..

"పెన్ పవర్"తో పాటు పలు దినపత్రికల్లోనూ సర్వే నెం.214 ప్రభుత్వ భూమి కబ్జాపై వార్తా కథనాలు..

దుండిగల్‌ తహశీల్దార్‌కి, మున్సిపల్ కమిషనర్‌కి చర్యలు చేపట్టాల్సిందిగా సూచించిన కూనా..

 

కబ్జాలను తక్షణమే తొలగించాలని సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో శ్రీశైలంగౌడ్..

కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన శ్రీశైలంగౌడ్..

కబ్జాల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే కూనా..

దుండిగల్‌ మండలం గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 214 లో కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జా..!

కాంగ్రెస్ నేతల పేరుతో కబ్జాలకు పాల్పడుతున్నారని శనివారం ఆకుల సతీష్ పత్రికా ప్రకటన..

సుమారు 1500 గజాల ప్రభుత్వ భూమి కబ్జాపై ఆదివారం "పెన్ పవర్" దినపత్రికలో ప్రత్యేక కథనం..

 

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, డిసెంబర్ 29:

మేడ్చల్ జిల్లా దుండిగల్‌ మండలం గాగిల్లాపూర్ ప్రభుత్వ భూమి కబ్జాలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఓ నాయకుడికి అండగా ఓ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నట్లు ఆకుల సతీష్ అసరోపిస్తూ.. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనతో ఆదివారం పెన్ పవర్ దినపత్రికలో ప్రత్యేక కథనంగా ప్రచురించగా..! పలు దినపత్రికలోనూ వచ్చిన వార్తా కథనాలకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర నాయకుడు కూనా శ్రీశైలంగౌడ్ తీవ్రంగా స్పందించారు.. కాంగ్రెస్ పార్టీ పరువు తీసే విధంగా ఎవరైనా కబ్జాలకు పాల్పడితే..! ఉపేక్షించేది లేదని కబ్జాదారులను ఆయన హెచ్చరించారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండల పరిధిలోని గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 214లో కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతుందని  పత్రికల్లో వచ్చిన కథనాలతో..!మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌కి,దుండిగల్‌ తహశీల్దార్‌, మున్సిపల్ కమిషనర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ "పెన్ పవర్" ప్రతినిధితో తెలిపారు.. గాగిల్లాపూర్ 214 ప్రభుత్వ స్థలం కబ్జాలాపై ఆరా తీసిన ఆయన..! కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తే సహించేది లేదన్నారు.. వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ దుండిగల్ మండలం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు, జిల్లా అదనపు కలెక్టర్‌కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్..

దుండిగల్‌ మండలం గాగిల్లాపూర్ సర్వే నెం.214 ప్రభుత్వ భూమిలో సుమారు 1500 గజాలు కబ్జాకు గురైనట్లు విషయం తెలియగానే..! మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌కి, దుండిగల్‌ గండిమైసమ్మ తహశీల్దార్‌‌కి, దుండిగల్‌ కమిషనర్‌కి తాను ఫోన్ చేసి ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు చేసినట్లు, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూనా శ్రీశైలంగౌడ్ "పెన్ పవర్" ప్రతినిధితో తెలిపారు.. ప్రస్తుతం పనులు నిలిపి వేశామని అధికారులు చెప్పడంతో..! వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని యెడల దానకిషోర్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీశైలంగౌడ్ అన్నారు..ఈ కబ్జా వ్యవహారంపై ఆయన ప్రత్యేకంగా ఆరాతీసినట్టు తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పేరుతో కబ్జాలకు పాల్పడితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానంటూ తెలిపారు..

సంపన్నులకో న్యాయం..! సామాన్యులకో న్యాయమా..?

ఫిర్యాదులపై "తహశీల్దార్- మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించాలని.. ప్రభుత్వ భూముల కబ్జాలపై రెవెన్యూ అధికారులు..! అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు, తక్షణమే స్పందించాలని కూనా శ్రీశైలంగౌడ్ అన్నారు.. 60 గజాల్లో సామాన్యుడు ఇళ్ళు నిర్మించుకుంటే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు 1500 గజాల్లో అనుమతుల్లేని కమర్షియల్ గోదాము నిర్మాణం చేపడుతుంటే తహశీల్దార్, కమిషనర్, ఏం చేస్తున్నారని కూనా శ్రీశైలంగౌడ్ ప్రశ్నించారు.. చర్యలు తీసుకోకపోతే..! అధికారుల వ్యవహార శైలిపై మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ధానకిషోర్‌కి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూనా శ్రీశైలంగౌడ్ తెలిపారు..

About The Author: Admin