పెన్ పవర్‌ కి.. తెలంగాణ సిఎంఓ ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్..

ట్రు కాలర్‌లో టీమ్ రేవంత్‌రెడ్డి సీఎంఓ ఆఫీస్"గా కాలర్ ఐడి..

పెన్ పవర్ పత్రికలో అక్రమ నిర్మాణాలపై "వార్త రాశావని" ఫిర్యాదు వచ్చిందని ఫోన్ కాల్..
గాంధీభవన్ నుండి "రామ్‌కుమార్ గౌడ్" టీపీసీసీ కో-ఆర్డినేటర్ అంటూ బెదిరింపులు..
గతంలో "పెన్ పవర్ దినపత్రిక" వార్తా కథనాలను కటింగ్‌లు పెట్టాలని బెదిరింపులు..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మే 27:

అక్రమ నిర్మాణాలపై వార్తా కథనాన్ని మంగళవారం పత్రికలో వేయడానికి సోమవారం పెన్ పవర్ వెబ్ సైట్‌లో ఉంచగా.. పెన్ పవర్ బ్యూరో చీఫ్‌కు "సీఎంఓ" నుంచి బెదిరింపు కాల్..! అక్రమ కట్టడాలకు అండగా  స్వయంగా తెలంగాణ   సీఎం ఓ ఆఫీస్ నుంచే నేరుగా ఫోన్ కాల్ వచ్చిందంటే.. అక్రమ నిర్మాణదారులకు, ఇటు జీహెచ్ఎంసి అధికారుల అండా.... అటు రాజకీయ నాయకుల దండా ఎంతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇక వివరాల్లోకి వెళితే  పెన్ పవర్ బ్యూరో చీఫ్‌కు సోమవారం సాయంత్రం తెలంగాణ సీఎంవో ఆఫీస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది... ఫోన్ నెం.8790879096 రామ్‌కుమార్ గౌడ్..

అవతలి వ్యక్తి ఫోన్ సంభాషణ..

హలో నీ పేరు మధునేనా...మేము గాంధీ భవన్ నుండి ఫోన్ చేస్తున్నము.. "నేను టీపీసీసీ కోఆర్డినేటర్‌ను" ఎక్కడుంటావ్..?  సూరారంలో ఉంటారా మీరు..!మీ మీద ఇష్యూ వచ్చింది.. బిల్డింగ్స్ కట్టుకున్న వారిని బెదిరిస్తున్నావట.. నువ్వు కాదులే మీ మనుషులను పంపించి మనీ డిమాండ్ చేస్తున్నట్లు మాకు కంప్లైంట్ వచ్చింది.. మాకు అన్ని కంప్లైంట్‌లు చాలా వస్తయ్.. మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నం... చాలామంది మనీ దందా చేస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను, జర్నలిజంలో ఉన్నవారిని.. వారి హెడ్స్‌తో మాట్లడి పీకేపిస్తున్నం.. అక్రమ నిర్మాణాలపై వార్త ముందే రాయాలి కదా, మీరు రాశారా.. నీ పేపర్‌లో వేసిన న్యూస్ ఉందా..? ఆ న్యూస్ కటింగ్‌లు పంపివ్వు.. నేను అడుగుతున్నప్పుడు రూల్స్ మాడ్లావు కదా... ఇన్షియల్ స్టేజిలో రాశావా..? దాన్ని పంపియ్.. అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారా మున్సిపల్‌ ఆఫీస్ లో..? మున్సిపల్‌లో రైడ్ చేయమని వాళ్ళకు ఎవలకో చెప్పి పంపిస్తున్నారట కదా...! మున్సిపల్ వాళ్ళతో  కుమ్మక్కు ఉందా..? నువ్వు నీ పేపర్ లో ఎన్నిసార్లు ఈ రాసినవో.. మున్సిపల్ వాళ్ళు ఏం  యాక్షన్  తీసుకున్నరో.. నేను అదంతా బయటకు తీస్తలేగాని, నువ్వు ఇంతకు ముందు రాసిన వార్తలన్నీ .. నాకు పేపర్ కటింగులు పంపించు.. ఇమ్మిడియెట్‌గా కావాలి.. అని ఫోన్ లోనే హుకుం జారీ చేసి ఫోన్ పెట్టేసారు సదరు తెలంగాణ సీఎంవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తి... 

ఆ ఫోన్ సంభాషణ ను విన్న వెంటనే స్పందించిన పెన్ పవర్ మేనేజ్ మెంట్ వెంటనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు సమాయత్తమైంది. పై ఫోన్ కాల్ నిజంగా సీఎంవో ఆఫీస్ నుంచే వచ్చిందా...? లేక వేరే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఫోన్ చేసి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు వంత పాడుతూ.. నిజాలు నిర్భయంగా.. స్వేచ్ఛగా.. వార్తలు రాసే జర్నలిస్ట్‌లను భయబ్రాంతులకు గురిచేస్తూ...! వార్నింగ్  ఇస్తున్నారా...?  లేక ఏమైనా చేస్తున్నారా...? అన్నది ఇప్పుడు పోలీసులే తేల్చాలి.?

About The Author: Admin