ఎదుగుదలను జీర్ణించుకోలేకనే..!కుట్రలు పన్నారు..

నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ముకుమ్మడి రాజనామా..

పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నూతన కమిటీ ఏర్పాటుకు నిరసనగా రాజీనామా..

ఎదుగుదలను ఓర్వలేకనే, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు కుట్రలు..

పదవికి మాత్రమే దూరమవుతున్న.. ప్రజలకు కాదు..! ఆకుల సతీష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ నాయకులు , పదవులకు మూకుమ్మడి రాజీనామా..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, జూలై 12:

నిజాంపేట్ కార్పొరేషన్‌లో బీజేపీ పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా..! రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకలు కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ అన్నారు.. మూకుమ్మడి రాజీనామా చేసిన,అధ్యక్ష, కమిటీ సభ్యులు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.. ఆకుల సతీష్ మాట్లాడుతూ..! కార్పొరేషన్‌లో చురుగ్గా పనిచేస్తూ కొనసాగుతున్న పార్టీ కమిటీని నిర్వీర్యం చేసేందుకు..! కుట్రలు పన్నారని ఆరోపించారు .. ఎలాంటి సమావేశం నిర్వహించ కుండానే 9 జూలై 2024న..! మూడు గ్రామాలకి గ్రామ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై నిజాంపేట్ కార్పొరేషన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. అయినప్పటికీ పట్టించు కాకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ మరియు కమిటీలో వివిధ బాధ్యతలో ఉన్న నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు..  కార్పొరేషన్‌లో పార్టీ ఎదుగుదలను ఓర్వలేని రాష్ట్ర,  జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు ఈ విధంగా వ్యవహరించడం, ఆ పార్టీ పెద్దలు విచారణ జరిపించాలని అన్నారు..! 

 

ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి..

ప్రతిపక్ష ప్రజా ప్రతినిధికి లబ్ధి చేకూర్చే విధంగా పార్టీలో తీసుకునే నిర్ణయాలు.. బీజేపీని నిర్వీర్యం చేయడానికే అంటూ ఆరోపణలు చేశారు..  కొందరు సీనియర్ నాయకుల వ్యవహార శైలిపై రాష్ట్ర, కేంద్రపార్టీ పెద్దలు దృష్టి సారించి..! ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూడాలని అన్నారు.. సంస్థాగత ఎన్నికలు జరిగే వరకూ కార్పొరేషన్ కమిటీని కొనసాగించాలని మరియు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా కార్పొరేషన్‌లో గ్రామ కమిటీల అధ్యక్షుల నియామకం రద్దు చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గొల్ల కృష్ణ, రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రముఖ అమలేశ్వరి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కాశి,సెక్రటరీ అరుణ్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సోషల్ మీడియా కో-కన్వీనర్ విజయ్ కుమార్, తిలోక్,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాము, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత రెడ్డి, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ ముఖేష్, ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, ట్రేడర్ సెల్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సతీష్ కృష్ణ , పట్నాయక్, డివిజన్ అధ్యక్షులు మాధవరావు, ప్రదీప్ కుమార్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, హనుమయ్య, చిరంజీవి, మోక్షశ్రీ,, నరోత్తం రెడ్డి ,వెంకటేష్, కృష్ణ, జి రాజేష్ వరుణ్ రెడ్డి నవీన్, సందీప్, యాకూబ్, సుధాకర్, మహేష్ ,అనునియ తదితరులు తమ బూత్స్ డివిజన్ అధ్యక్షులు బాధ్యతలకు రాజీనామా సమర్పించడం జరిగింది..

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.