అమలాపురం , పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్ నవంబర్ 7:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం 2 పథకంపై వినియోగదారులకు ఏవైనా అనుమానాలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకొనవచ్చు నని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆమె పాత్రికేయులు సమావే శంలో మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగ దారులకు గ్యాస్ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రారంభించిన ఈ పథకం సమర్థవంతంగా కొనసాగేందుకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచి తంగా పొందడంలో వారికున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రతి దశలో జిల్లా యంత్రాంగం గ్యాస్ ఏజెన్సీలు తగిన సహకారం అందించడం తోపాటు టోల్ ఫ్రీ నెంబ ర్ను కూడా ఏర్పాటు చేసిందన్నారు. మొదటి సిలిండర్ను అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకొన వచ్చునని ఆమె స్పష్టం చేశారు. ఆధార్ రేషన్ కార్డ్ ఈ కేవైసీ పూర్తి చేసుకునేందుకు గ్యాస్ డెలివరీ బాయ్ కూడా తగిన సహకారం అందిస్తారని లేదా సచివాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రూపంలో దరఖా సమర్పిస్తే వారు కూడా ఈ కేవైసీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన సందర్భం లోనూ సిలిండర్ డెలివరీ సందర్భంలోనూ, సిలిండర్ సబ్సిడీ సొమ్ములు 48 గంటలు లోపు తిరిగి జమ అయ్యే సమయంలోను చరవాణి కి సంక్షిప్త సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలి వరీ బాయ్ కి ఓటీపీ నెంబర్ను వినియో గ దారులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 1967 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తదుపరి గ్యాస్ కనెక్షన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు తెలుపుతూ తాము దీపం 2 పథకానికి అర్హులమా, అనర్హులమా అన్న కోణంలో వినియోగ దారులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకొనవచ్చునన్నారు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహ కులు వినియోగదారులు కొన్న సందేహాలను కూడా నివృత్తి చేస్తారని ఆమె స్పష్టంగా చేశారు. ఒక కుటుంబంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నా ఒక కనెక్ష న్ కు మాత్రమే ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ పథకం వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఎల్పిజి సిలిండర్ బుకింగ్ నిమిత్తం గతంలో మాదిరి గానే ఫోన్ ద్వారా బుక్ చేసుకుని వచ్చునని ఈ కేవైసీ చేసుకోవడానికి గ్యాస్ డెలివరీ బాయ్ కూడా తగిన సహకారం అందించడం జరుగు తుందని ఆమె తెలిపారు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళవ లసిన అవసరం లేదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.