మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో కరెంటు లేక గ్రామం అంధకారంలో ఉంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం రాత్రి 10:30 కు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని లైన్మెన్ సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ లోపం వల్ల గ్రామంల 4 వీధులకు
పూర్తిగా కరెంట్ సప్లై ఆగిపోయింది. కరెంట్ లేకపోవడం వల్ల నీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వద్ద తమ గోడు వినిపించుకుంటే కరెంటుతో మాకు సంబంధం లేదని బదులిస్తున్నారు. ఏపీ ట్రాన్స్కో అధికారులు అందుబాటులో లేరు మేము ఎవరికి మోర పెట్టుకోవాలి అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు
. జిల్లా ఉన్నతాధికారులు గ్రామస్తుల సమస్యలపై స్పందించి పరిష్కార మార్గం చూపాలని లేనిపక్షంలో గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు విస్తృత పరుస్తామని హెచ్చరించారు.