ఏజెన్సీలో నివసిస్తున్న మాదిగలంతా ఐక్యమత్యంతో ముందుకు సాగినట్లయితే హక్కులు సాధించుకోవచ్చని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నిడమర్తి చిన్నబాబు పిలుపునిచ్చారు బుధవారం మండలంలోని పిడతమామిడిలో మండల కమిటీ కార్యదర్శి జి మోషే ఆధ్వర్యంలో జరిగిన మండల కమిటీ సమావేశానికి డాక్టర్ చిన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కుటుంబం విద్యకు ప్రాధాన్యత ఇస్తూ జాతిని ముందుకు నడపాలని అన్నారు.
ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ మాదిగ దండోరా జండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు .గతంలో ఎన్నడూ లేనట్టుగా మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎన్డిఏ కూటమికి మద్దతుగా నిలవడంతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే గెలుపుకు మన వంతు కృషి చేసామని రానున్న రోజుల్లో ఏజెన్సీ మాదిగలకు ఎన్డిఏ కూటమి మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షులు వేమగిరి అర్జున్,ఎంజెఎఫ్ జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు గంగవరం మండల కన్వీనర్ ములగాడ ప్రసాద్, నిడమర్తి రమేష్ కుమార్,సోమరాజు, గెంజేటి నాని, రూబేను, సింగరయ్య, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.