కొయ్యురు,పెన్ పవర్,ఫిబ్రవరి 25: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న గూడెం కొత్త వీధి మండల పెన్ పవర్ విలేఖరి మాదిరి చంటిబాబును కొయ్యూరు మండలం, యు.చీడిపాలేం సర్పంచ్ దడేల రమేష్ మంగళవారం ఆయన స్వగ్రామమైన దొడ్డికొండ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోనికి వెళ్లి ప్రజా సమస్యలను వెలికి తీసి వార్తలుగా ప్రచురించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సర్పంచ్ రమేష్ తనకు తోచిన ఆర్థిక సహాయాన్ని విలేఖరి చంటిబాబుకు అందించారు. తనను పరామర్శించడానికి వచ్చినందుకు సర్పంచ్ కు చంటిబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దామనపల్లి పంచాయతీ ఉపసర్పంచ్ గెమ్మెలి చిలకమ్మా తదితరులు పాల్గొన్నారు.