PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 9:44 pm Posted By : D Ratnam

ఘనంగా శ్రీశ్రీశ్రీ వర బాపనమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు

గోకవరం గ్రామ శివారు కొత్తపల్లి రోడ్డులో శ్రీశ్రీశ్రీ వర బాపనమ్మ అమ్మ వారి జాతర తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నిన్నటి నుండి మూడు రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయని అమ్మవారి ఆలయంలో జాగరణ మరియు భజన బృందాలు ప్రత్యేక కుంకుమ పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రేపు గ్రామస్తులు రైతులు సహకారంతో ఆలయం వద్ద గొప్ప అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఆర్య వద్ద గరం నృత్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు, ఆలయంలో రంగులు గ్రానైట్ మరియు స్టీల్ మెస్సలు లాంటి ఆలయ అభివృద్ధికి  ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాసరావు రూ 1,90,000/–సహాయం చేసినట్లు,అమ్మవారి ఆలయం లో గాజులు పసుపు కుంకుమ ప్యాకింగ్ ప్రసాద ప్యాకింగ్ నిమిత్తం దొరై స్వామి శ్రీనివాసం అందింస్తున్నట్లు, లడ్డు దాత మాధవ స్వీట్స్ అండ్ బేకరీ, బఫే ప్లేట్లు నిమిత్తం శ్రీ శ్రీనివాస్ హనుమాన్ ఎంటర్ప్రైజెస్ అందించినట్లు ఆలయ సేవకులు తెలిపారు, ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజలు అర్చకులు జగన్నాధ శర్మ మరియు శ్రీనివాస శర్మలు నిర్వహించారు.