PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 10:39 pm Posted By : PEN POWER MEDIA

జనగణన పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం..

జనగణన పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం.. జాయింట్ డైరెక్టర్, బి.వి.ఎల్.సాయి శేఖర్

మే నెలలో జనాభా నమోదు పూర్తి లక్ష్యం

గ్రామ, పట్టణ స్థాయిలో సమగ్ర ప్రణాళిక

సీఎంఎంఎస్ మాడ్యూల్స్‌పై ప్రాక్టికల్ శిక్షణ

స్వీయ గణన మరియు మొబైల్ యాప్ వినియోగం

డేటా గోప్యత, భద్రతపై ప్రత్యేక దృష్టి

స్టాఫ్ రిపోర్టర్ పెన్ ఒవర్, శ్రీకాకుళం. ఫిబ్రవరి 24:

జనగణన–2027 నిర్వహణకు సంబంధించి శ్రీకాకుళం, ఎచ్చర్ల, శివాని ఇంజనీరింగ్ కాలేజీలో జిల్లా మరియు ఛార్జ్ అధికారులకు 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ జనగణన కార్యకలాపాల జాయింట్ డైరెక్టర్, బి.వి.ఎల్ సాయి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. జనగణన నమోదుకు సంబంధించి పూర్తి వివరాలు, మే ఒకటవ తేదీ నుండి మే 31 లోగా పూర్తి చేయాలని జాయింట్ కలక్టర్ తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజల నివాసాలను గుర్తించాలన్నాతు. ఎల్ల్యూమి లెటర్స్ మరియు సూపర్వైజర్లు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా సంబంధిత అధికారులు తగు ఆదేశాలు ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు, తాహాశీల్దారులు మరియు ఎం.పి.డీ.వోలు, జిల్లా మరియు గ్రామ పాపులేషన్ వివరాలు పూర్తి చేయుటలో సంబంధిత సిబ్బందికి ఒక ప్రణాళికా బద్దంగా వారికి జనాభా నమోదు శాతాన్ని కేటాయించాలని తెలిపారు. ఈ ప్రక్రియ తదుపరి ఫిబ్రవరి 2027 లో జరుగుతుందని తెలిపారు. ఈ మూడు రోజుల శిక్షణలో జనగణన–2027 లక్ష్యాలు, చట్టపరమైన నిబంధనలు, జనగణన సిబ్బంది పాత్ర, నిధుల నిర్వహణ, మానవ వనరుల వినియోగం మరియు ప్రచార కార్యక్రమాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర సమాచారాన్ని వివరించారించుట జరుగుతుందని తెలిపారు.

సిఎంఎంఎస్(కోర్సేస్ మేనేజ్మేంట్ మరియు మోనిటిరింగ్ సిస్టమ్) మాడ్యూల్స్, యూజర్ నమోదు, హెచ్ఎల్ఓ నిర్వహణ, శిక్షణ నిర్వహణ, నియామక ఉత్తరాలు మరియు ఐడీ కార్డుల జారీ విధానం వంటి అంశాలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించడం జరుగుతుందని. గ్రామం/పట్టణం/ఛార్జ్ రిజిస్టర్ల తయారీ, హెచ్ఎల్బి క్రియేటర్ ద్వారా హెచ్ఎల్బి విభజన మరియు లేఅవుట్ మ్యాప్ తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
అలాగే స్వీయ గణన ( సెల్ఫ్ ఏన్యూమేరేషన్) ప్రక్రియ, సమాచార దాత, గణనాధికారి మరియు పర్యవేక్షకుల బాధ్యతలు, హెఎల్ఓ మొబైల్ యాప్ వినియోగం, డేటా ధృవీకరణ, డేటా నైతికత, గోప్యత మరియు భద్రత అంశాలపై అవగాహన కల్పించుట జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగణన జాయింట్ డైరెక్టర్ బి. వి. ఎల్. సాయి శేఖర్, రెవెన్యూ , ముఖ్య ప్రణాళిక, జిల్లా విద్య ,పంచాయతీ, ఫారెస్ట్ ,జిల్లా పరిషత్, సర్వే శాఖల, అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.