- ముంచంగిపుట్టులో గంజాయి రవాణా బట్టబయలు
- ఇద్దరు నిందితులు అరెస్ట్ – 50 కేజీల గంజాయి స్వాధీనం
- ఆపరేషన్ వజ్ర ప్రహార్ కింద పోలీసుల కఠిన చర్యలు
- లబ్బురు జంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు
- ఒడిశా నుంచి గంజాయి సరఫరా మార్గం వెలుగులోకి
- జోలపుట్టు కేంద్రంగా అక్రమ రవాణా నెట్‌వర్క్
- బైక్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
- అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ గ్యాంగ్‌పై దర్యాప్తు
- విశాఖ సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు
గంజాయి నిర్మూలనకు పోలీసుల హెచ్చరికలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు భారీ దాడి చేపట్టారు. ముంచంగిపుట్టు మండలంలో ఇద్దరిని అరెస్ట్ చేసి 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఆర్ అభిషేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ వజ్ర ప్రహార్, అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌పై కీలక దెబ్బగా నిలిచింది.
ముంచంగిపుట్టు, పెన్ పవర్, మార్చి 20:
అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచింగిపుట్టు మండలంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి వ్యక్తుల అరెస్ట్ చేసి 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పాడేరు డీఎస్పీ ఆర్ అభిషేక్ తెలిపారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ఆదేశాల మేరకు చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ లో భాగంగా, శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాడేరు డీఎస్పీ అభిషేక్ కీలక వివరాలు వెల్లడించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రస్తుతం ఎక్కడా గంజాయి సాగు లేదని, అయితే అంతర్రాష్ట్ర స్మగ్లర్లు మన జిల్లా సరిహద్దులను కేవలం రవాణా మార్గంగా వాడుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ముంచంగిపుట్టు ఎస్.ఐ తో పాటు సిబ్బంది లబ్బురు జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, బైక్‌పై పారిపోవడానికి ప్రయత్నించిన నరసింగ్ (ఎ-2 ) అనే వ్యక్తిని చాకచక్యంగా పట్టుకోగా, అతని సమాచారం మేరకు జోలపుట్టు సమీపంలో భీమా (ఎ-1) అనే వ్యక్తిను అదుపులోకి తీసుకోని కోర్టులో హజరుపర్చి విశాఖపట్నం సెంట్రల్ జైలు కి పంపిoచడం జరిగింది అని తెలిపారు. వీరి విచారణలో ఒడిశాలోని పనసపుట్టు, జనబ, జంత్రి, తాబేరు పరిసర ప్రాంతాలలో నుండి గంజాయిని సేకరించి, అక్కడి నుండి ముంచంగిపుట్టు మండలంలోని బుంగపుట్టు మరియు లబ్బురు గ్రామాల మీదుగా జోలపుట్టును కేంద్రంగా చేసుకుని, అక్కడి నుండి ఒడిశాలోని జైపూర్ కు అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. జైపూర్ కేంద్రo గా ఈ అక్రమ గంజాయి వ్యాపారము సాగుతుందనీ, నిందితుల నుండి 50 కేజీల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసు కున్నామన్నారు. పొరుగు రాష్ట్ర అధికారుల సమన్వయంతో ఇలాంటి రవాణా నెట్‌వర్క్‌లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాడేరు డీఎస్పీ హెచ్చరించారు.