అడ్డతీగల పెన్ పవర్ మార్చ్31: మంగళవారం అడ్డతీగల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొడ్డపాటి.రాఘవ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎం.పి.డీ.వో ఏ.వి.వి కుమార్, తాసిల్దార్ దొరకయ్య, జడ్పిటిసి మద్దాల. వీర్రాజు, ఆర్.బ్ల్యూ. ఎస్..ఏ. ఈ చందు, హౌసింగ్ ఏఈ రాజశేఖర్ బాబు, ఐ.సి.డి.ఎస్.. పిఓ క్రాంతి కుమారి , వైద్యాధికారులు, వెలుగు ఏపీఎం బి. అప్పారావు, ఎన్.ఆర్.జీ.ఎస్ ఏపీఎం చిరంజీవి , విద్యుత్ శాఖ ఏయి, అటవీశాఖ అధికారి, విద్య శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొంతమంది అధికారులు హాజరవగా, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, తదితర కొన్ని శాఖల అధికారులు గైరాజరయ్యారని ఎంపీపీ బొడ్డపాటి. రాఘవ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే హాజరవకపోతే ఇక ప్రజా ప్రతినిధులు అభివృద్ధిపై ఎవరితో చర్చిస్తారని ఆమె ప్రశ్నించారు.
జడ్పిటిసి మద్దాల. వీర్రాజు మాట్లాడు తూవేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, మండలంలోని 99 గ్రామాలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా హ్యాండ్ బోర్లు పై ప్రత్యేక దృష్టి సారించాలని జడ్పిటిసి అధికారులకు విజ్ఞప్తి చేశారు. జడ్పిటిసి మద్దాల. వీర్రాజు సర్పంచులతో మాట్లాడుతూ మీ గ్రామాల్లో చెడిపోయిన హ్యాండ్ బోర్లు ఉంటే నేరుగా ఎంపీపీకి, ఎంపీడీవో కి తెలియపరచవచ్చని అన్నారు. అనంతరం పదవీకాలం ముగుస్తున్న సర్పంచులు వార్డు మెంబర్లకు అధికారులు ప్రజాప్రతినిధులు వారు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాలసుబ్రమణ్యం, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.