అమ్మమ్మ ఊరికి బ్రిడ్జి నిర్మించమని జిల్లా కలెక్టర్ గారిని వేడుకొన్న పదవ తరగతి చదువుతున్నగిరిజన విద్యార్థి … క్రిషి వసంత్
అడ్డతీగల, పెన్ పవర్, మార్చ్ 30:
అడ్డతీగల మండలం ధాన్యం పాలెం _చిన్న మునకన గడ్డ గ్రామాల మధ్య చండ్రా కాల్వపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 6 సంవత్సరాలు నుండి అసంపూర్తిగా ఆగిపోయి ఉందని,పోలవరం జిల్లా నూతన కలెక్టర్ దినేష్ కుమార్ ను గ్రీవెన్స్ లో కలిసి బ్రిడ్జి నిర్మాణము పూర్తి చేయమని వేడుకోగా సానుకూలంగా స్పందించి సత్వరమే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివరాల్లోకి వెళితే కింటుకూరి. క్రిషి వసంత్ వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి , నవోదయ పెద్దాపురంలో ఇటీవల పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసుకొని వచ్చి, అందరిలా కాకుండా తన అమ్మమ్మ గారి ఊరికి ఎంతో కాలంగా బ్రిడ్జి లేకపోవడం వల్ల విద్యార్థులు, ప్రజలు ,రైతులు ఇబ్బందులు పడుతున్నారని , నేను కూడా మా అమ్మమ్మ ఊరు వెళ్ళడానికి చాలాసార్లు ఇబ్బంది పడ్డానాని, జిల్లా కలెక్టర్ కి పబ్లిక్ గ్రీవెన్స్ లో వేడుకొన్నాడు. చిన్న వయసులోనే తన ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినందుకు , అక్కడున్న అధికారులు, ప్రజలు క్రిషీ వసంత్ కి అభినందనలు తెలియజేశారు.