PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 11:41 am Posted By : YEDUKONDALU DADALA

అరుదైన గౌరవం అందుకున్న కాకతీయ రాజు దంపతులు

జిటిసిఎం సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరణ – పలువురి అభినందనలు

ఆత్రేయపురం, పెన్ పవర్,మార్చి 28:
కాకతీయ విద్యా సంస్థల అధినేత కాకతీయ రాజు గారు మరియు కాకతీయ చైర్ పర్సన్ పద్మలత శనివారం జిటిసి సంస్థ ద్వారా గ్రాడ్యుయేషన్ స్వీకరించి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.ఈ కార్యక్రమం ఆత్రేయపురం సెంట్రల్ చర్చి అధినేత అపో. బిషప్ యం. సామ్యూల్ గారు మరియు నీలావతి గారి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి జిటిసిఎం డైరెక్టర్ బెంజమిన్ గారు మరియు వారి బృందం ప్రత్యేకంగా హాజరై గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తూ, వ్యాపార రంగంలోనూ విజయవంతంగా ముందుకు సాగుతూ, దేవుని సేవలోనూ నిబద్ధతతో సేవలు అందిస్తున్న కాకతీయ రాజు – పద్మలత దంపతులకు ఈ గౌరవం దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గండి శ్రీను (బంకు శ్రీను) దడాల లక్ష్మి, హోండా షోరూం సిబ్బంది, ఆత్రేయపురం సంఘ పెద్దలు మరియు విశ్వాసులు దంపతులను ఘనంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.వీరిరువురు విద్యా, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో సమానంగా సేవలందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు.