PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 7:49 pm Posted By : M CHANTI BABU

ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయింది:బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్

స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,మార్చి 28:కూటమి పాలనలో ఆదివాసీలకు రక్షణ లేకుండా పోయిందని బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు కిల్లో రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు దాడులు, మరోవైపు అవమానాలు జరుగుతున్నా ఆదివాసీల తరఫున మాట్లాడే నాయకులు కనిపించడం లేదని విమర్శించారు.ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఇంటి గుమ్మం దాటడంలేదని, అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదని ఆయన ఆరోపించారు. అమాయక ఆదివాసీ ప్రజల జీవితం, ఆత్మగౌరవాన్ని కాపాడే వారు ఎవరని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. అడుగడుగునా ఆదివాసీలను నమ్మించి మోసం చేస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. వివక్ష చూపడం బాధాకరమని, అట్రాసిటీ చట్టం ముందు ఎవరూ అతీతులు కాదని, ఎంతటి పెద్ద నాయకుడైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆదివాసీ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కిల్లో రాజన్ స్పష్టం చేశారు.