గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 21:గూడెం కొత్త వీధి మండలంలోని ఆర్మీ నగర్ లో నూకాంబిక అమ్మవారి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా డీ జోడి సెలబ్రిటీ గని ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఉత్సవాలు విజయవంతం కావడంతో కమిటీని పలువురు అభినందించారు.