PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 10:15 am Posted By : PEN POWER MEDIA

ఆస్తుల లొల్లికి ఫుల్ స్టాప్… కామానా….

  • ఉమ్మడి కుటుంబ ఆస్తులే అన్న విజయమ్మ స్పష్టం
  • ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని కీలక ప్రకటన
  • నలుగురు మనవలకు సమాన వాటా
  • షర్మిలకు రావాల్సింది హక్కు, బహుమతి కాదు
  • సరస్వతి సిమెంట్స్ షేర్లు, యలహంక ఇల్లు షర్మిలదే అని క్లారిటీ
  • జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడని ఆరోపణ
  • వైసీపీ నేతల ప్రచారంపై ‘గోబెల్స్’ వ్యాఖ్యలు
  • ఎంఓయూ హక్కును గుర్తించేదే తప్ప దానం కాదని వివరణ
  • నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో అఫిడవిట్‌తో కేసుకు మలుపు
  • కుటుంబ పెద్దగా షర్మిలకు అండగా నిలిచిన విజయమ్మ

విజయవాడ, పెన్ పవర్ మార్చి 21:

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల చిచ్చు మరోసారి బహిర్గతమైంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో వేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా విజయమ్మ శుక్రవారం ఒక కీలక అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ” వైఎస్సార్ బ్రతికున్నంత వరకు ఆస్తుల పంపకం జరగలేదు.. ఉన్నవన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులే అని ఆమె ఈ అఫిడవిట్ ద్వారా స్పష్టం చేశారు. విజయమ్మ తన అఫిడవిట్‌లో జగన్ వాదనలను పూర్తిగా తప్పుపట్టారు. 2009లో వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే . ఆస్తుల పంపకం ఎప్పుడూ అధికారికంగా జరగలేదన్నారు. తన మనవలు, మనవరాళ్లు నలుగురికి ఆస్తులను సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఉద్దేశ్యం, ఆజ్ఞ అని ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్ షేర్లతో పాటు, ఎంఓయూ లో లేని బెంగళూరులోని యలహంక ఇల్లు కూడా షర్మిలదేనని, అది వైఎస్సార్ ఆజ్ఞ అని తెలిపారు. జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అంటే షర్మిల పిల్లలకు అన్యాయం చేశాడని, ఇప్పటికైనా వారికి న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఈ అఫిడవిట్‌ను వైఎస్ విజయమ్మ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో సమర్పించారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల బదిలీకి సంబంధించి జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఈ పత్రాన్ని నోటరీ చేయించి, అధికారికంగా ట్రిబ్యూనల్‌కు అందజేశారు.షర్మిల ఆస్తుల కోసం పాకులాడుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. షర్మిల వద్ద ఉన్న ఆస్తులు జగన్ ఇచ్చినవి కావు, అవి ఆమెకు రావాల్సిన వాటా మాత్రమే అని స్పష్టం చేశారు. అలాగే తనను బినామీగా చిత్రీకరించవద్దని, దేవుడి సాక్షిగా తాను చెబుతున్నవన్నీ వాస్తవాలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలను మానుకోవాలని మీడియాను వేడుకున్నారు.గతంలో వైఎస్ జగన్, షర్మిల మధ్య జరిగిన ఎంఓయూ ప్రకారం కొన్ని ఆస్తులను బహుమతిగా ఇస్తానని జగన్ పేర్కొన్నారు. వైఎస్ ఫ్యామిలీ ఆస్తులపై ఇంటాబయటా పెద్ద రచ్చ జరుగుతోంది. పలువురు వైసీపీ నేతలు ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెట్టి షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ అఫిడవిట్‌ ద్వారా ఆస్తులపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇందులో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. వైఎస్సార్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులే అని స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఇప్పటివరకు అసలు జరగలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. జగన్ ఎంవోయూరాసింది కూడా షర్మిల హక్కును గుర్తించేనని, అది ఏమాత్రం దానం కాదని ఆమె స్పష్టం చేశారు.వైసీపీ నేతలు మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని విజయమ్మ గోబెల్స్ ప్రచారంగా అభివర్ణించారు. షర్మిలకు జగన్ వేల కోట్లు ఇచ్చారని ప్రచారం చేయడంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు ఆస్తి పంపకం కాదని, వ్యాపార లాభాల నుంచి ఇచ్చిన డివిడెండ్ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు.“నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుక్కి తెలుసు” అని అనడం ద్వారా విజయమ్మ ఒక తల్లిగా జగన్ మనస్సాక్షిని తట్టిలేపే ప్రయత్నం చేశారు. తన మేనల్లుడికి, మేనకోడలికి (షర్మిల పిల్లలకు) జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆవేదన చెందారు. సరస్వతి సిమెంట్స్‌తో పాటు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కూడా షర్మిలదేనని ఆమె తేల్చి చెప్పారు.రాజకీయ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని వాడుకోవద్దని ఆమె మీడియాను కోరారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారెవరైనా సరే, దేవుడి న్యాయమే అంతిమమని ఆమె పేర్కొనడం ద్వారా నైతిక పైచేయి సాధించే ప్రయత్నం చేశారుఈ అఫిడవిట్ ద్వారా విజయమ్మ ఒక ముఖ్యమైన సాక్షిగా మారారు.

రేపు కోర్టులో ఆస్తుల వివాదం నడిచినప్పుడు, వైఎస్సార్ బతికున్నప్పుడు ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని ఆమె చెప్పిన మాటలు జగన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. షర్మిల ఒంటరిగా పోరాడుతుందనే భావన కలగకుండా, కుటుంబ పెద్దగా విజయమ్మ ఆమె పక్షాన నిలిచారు. వైఎస్సార్ ఆశయం ప్రకారం నలుగురు మనవలకు సమాన వాటా దక్కాలనే పాయింట్‌ను ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.“దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలే” అని ముగించడం ద్వారా విజయమ్మ ఈ వివాదానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చారు. అధికార బలంతోనో, అబద్ధపు ప్రచారాలతోనో గెలవాలని చూసేవారికి ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. వైఎస్ కుటుంబంలో ఆర్థిక చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు. వైయస్ కుటుంబ ఆస్తుల వివాదంలో తల్లి విజయమ్మ తాజాగా వేసిన అఫిడవిట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. తన సొంత కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తన మనవలైన షర్మిల పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడంటూ ఆమె నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఆఫిడవిట్ దాఖలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతవరకు ఆస్తుల పంపకం జరగలేదని.. ఉన్నవన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని ఆమె తేల్చి చెప్పారు. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తులను సమానంగా పంచాలన్నదే రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరికగా, ఆజ్ఞగా ఆమె గుర్తు చేశారు. కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరస్వతి సిమెంట్స్ షేర్లతో పాటు ఇతర ఆస్తుల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మ తన కుమార్తె షర్మిలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తన తల్లి షేర్ ను చెల్లెలు షర్మిల దక్కించుకోవడంపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొద్దిరోజులుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ అఫీడవిట్ దాఖలు చేశారు. జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి దక్కాల్సిన వాటాలు ఇవ్వకుండా మోసం చేయడం పై విజయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్స్ షేర్లతో పాటు యలహంక ఇల్లు కూడా షర్మిల దేనని.. ఇది వైయస్సార్ స్వయంగా ఇచ్చిన ఆదేశమని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర విభేదాలతో తన చెల్లెలి పిల్లలకు రావాల్సిన ఆస్తులను జగన్ అడ్డుకోవడం ధర్మం కాదని ఆమె ఆ ప్రత్యేక న్యాయస్థానానికి పేర్కొన్నారు. షర్మిల అడుగుతోంది కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటాయే తప్ప.. జగన్ ఇచ్చే బహుమతి కాదని కూడా తేల్చి చెప్పారు.జగన్ తన తల్లి మాటలను మన్నించి తన సోదరికి న్యాయం చేస్తారా? లేక ఈ వివాదం రాజకీయ రచ్చగా మారుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, రాజకీయ కారణాలు, ఇతర విభేదాల వల్ల ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు జగన్ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించగా, అది తన హక్కు అని షర్మిల వాదిస్తున్నారు. ఇప్పుడు విజయమ్మ నేరుగా రంగంలోకి దిగి షర్మిల వైపు నిలబడటంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.