రామచంద్రపురం, పెన్ పవర్, మార్చి 23:
మండలం వెల్ల గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసంశెట్టి సత్యం మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.శిబిరంలో పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడి రామకృష్ణ,వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ, రైతు అధ్యక్షులు బలుసు శివప్రసాద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జగ్గంపూడి గనిరాజు (బాబులు), నారపరెడ్డి బలరాం, ఖండవల్లి శ్రీనివాసరావు, కేసనకుర్తి వెంకటేశ్వరరావు, పీలుఖ లక్ష్మీ భార్గవి రాఘవేంద్రరావు, గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, సొసైటీ ప్రెసిడెంట్ కొమ్మిరెడ్డి కోదండరాముడు, చిక్కాల స్వామి (ఎంపీటీసీ), వట్టికూటి యేసుబాబు, ఆకుల సతీష్, ఆకుల నారాయణరావు, గుండుబొగుల లక్ష్మణరావు, పిండి సురేష్, కొమ్మిరెడ్డి సురేష్, ఈత లక్ష్మణ్, ఏఓ మణిదీప్ తదితరులు,కూటమి నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.