సాయి అనే యువకునికి గాయాలు
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 :
ఎడ్లపాడు: గుంటూరు – చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సాయి అనే యువకుడు, ఎడ్లపాడు సమీపంలోకి రాగానే బైక్ ఒక్కసారిగా స్కిడ్ అవ్వడంతో ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కింద పడటంతో సాయికి శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, 108 ఫోన్ చేయడంతో బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.