గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 29:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల టిడిపి అధ్యక్షుడు పోత్తూరు కొండలరావు,టిడిపి ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ పసుపులేటి నాగమణి అధ్యక్షతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన గిరిజన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.అలాగే పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం కట్టుబడి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి, మాజీ జెడ్పిటిసి గంట నలిని కృష్ణ, మండల తెలుగు యువత అధ్యక్షుడు ముర్ల కోటేశ్వరరావు,మాజీ సర్పంచ్‌లు కంకిపట్టి నారాయణమ్మ, పసుపులేటి రామకృష్ణ, కొర్ర బలరాం, సీనియర్ నాయకులు వండలం బాలయ్య, ముక్కలు మహేష్, నడేల వెంకటలక్ష్మి, జుర్ర గంగరాజు, కొర్ర రాంబాబు, టీఎన్ఎస్ఎఫ్ నాయకురాలు ముక్కలి కళ్యాణి, యూనిట్ ఇంచార్జ్‌లు గుంట బుజ్జి బాబు, మురళీ భూపతి రాజు తదితరులు పాల్గొన్నారు.