జిల్లా పౌరసరఫరాల అధికారి విజయభాస్కర్
గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30:
పోలవరం జిల్లాలో ఎల్పిజి గ్యాస్ వినియోగదారుల సమాచారం రంపచోడవరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పి విజయ భాస్కర్ తెలిపారు. జిల్లా పరిధిలో గల 12 మండలాల లో ఎల్పిజి గ్యాస్ కు ఎటువంటి కొరతలేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పిజి గ్యాస్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఫోన్ నెంబర్. 08864243253 లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సంప్రదించాలని ఆయన కోరారు.