PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 1:48 pm Posted By : D Ratnam

ఏఎస్‌ఆర్ (పాడేరు) జిల్లాకు కొత్త కలెక్టర్‌గా టి. నిశాంతి నియామకం

 

పాడేరు, పెన్ పవర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఏఎస్‌ఆర్ (అల్లూరి సీతారామరాజు) జిల్లా కలెక్టర్‌గా 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీమతి టి. నిశాంతిని నియమించింది.ప్రస్తుతం కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నిశాంతి, పదోన్నతి పొందుతూ ఈ నియామకం పొందారు. ఆమెను ఏఎస్‌ఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నిశాంతి పరిపాలనా అనుభవం, పనితీరు దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో అభివృద్ధి, పరిపాలనలో మరింత పురోగతి సాధించేందుకు ఆమె కృషి చేయనున్నట్లు భావిస్తున్నారు.