PEN POWER
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 11:44 am Posted By : YEDUKONDALU DADALA

ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

  1. కాజులూరు, పెన్ పవర్, మార్చి 31:
    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 6న మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షులు పుణ్యమంతుల శివాజీ తెలిపారు.మంజేరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా క న్వినర్ సలాది వీరబాబు “మన ఊరు – మన జెండా” జిల్లా కన్వీనర్ సలాది వీరబాబు పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రతి పంచాయతీకి ఒక జెండా దిమ్మను ఏర్పాటు చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రామాలకు వచ్చే నిధుల వివరాలను ప్రజలకు తెలియజేసే నూతన విధానాన్ని రాష్ట్ర పార్టీ ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో బీజేపీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి నిమ్మన రాజేష్, వాసంశెట్టి రామకృష్ణ,మండల యువమోర్చా నాయకులు పుణ్యమంతుల నరేంద్ర, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.