- విధేయతకే ప్రాధాన్యం… నాయకత్వం పునరాలోచన
- సర్వే ఆధారంగా టిక్కెట్లు… తెలుగుదేశం కొత్త వ్యూహం
- ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వెల్లువ
- గత అనుభవాలపై పునర్విమర్శ… సీనియర్లకు అవకాశాలు?
- సర్వే నివేదికల ప్రాధాన్యం
- యువత ప్రయోగంపై సందేహాలు
- ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు
- కార్యకర్తలతో దూరం పెరుగుదల
- వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి
- చంద్రబాబు హెచ్చరికలు ప్రభావం లేకుండా?
- నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం
- సీనియర్లకు మళ్లీ అవకాశాల సూచన
- గత అనుభవాలపై పునర్విమర్శ
- నివేదికల ఆధారంగా తుది నిర్ణయం
స్టేట్ పొలిటికల్ బ్యూరో పెన్ పవర్, అమరావతి మార్చి 25:
తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు 263కు పెరుగుతుండటంతో కనీసం రెండు వందల స్థానాలకు కాస్త అటు ఇటుగా టీడీపీ పోటీ చేసే అవకాశముంది. అయితే ప్రస్తుతమున్న అనుభవంతో ఈసారి మాత్రం పార్టీ విధేయులకు పట్టం కట్టాలని యోచిస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో యువకులు, సామాజికవర్గంతో పాటు, వారి ఆర్థిక స్థితిని చూసి టిక్కెట్లను కేటాయించారు. అయితే అది చాలా వికటించింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో గెలిచి గాడి తప్పుతున్నారు.వేసిన అంచనాలకు వారి పనితీరుకు మధ్య పొంతన లేకుండా పోయింది. సీనియర్ నేతలను పక్కన పెట్టి కొంత తప్పు చేశామని ఇప్పుడు పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడింది. కొత్తగా వచ్చిన నేతలకు పార్టీ పట్ల కమిట్ మెంట్ లేకపోవడంతో పాటు క్యాడర్ ను దగ్గరకు తీసుకోకపోవడంతో పాటు తమ వ్యాపారాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు స్పష్టంగా తమకు అందుతున్న వివిధ సంస్థలు, నిఘా నివేదికల ద్వారా అందుతున్నాయి.ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు.తాము మొదటి సారి గెలిచి మోనార్క్ లమని భావిస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చేరవేయడం లేదన్నది నిర్ధారణ అయింది. అందుకే ఈ సారి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు, లోకేశ్ లు దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ స్థానాలను గెలుచుకోవాల్సిన అవసరం ఏర్పడటంతో ఈసారి అభ్యర్థుల ఎంపికలో దిద్డుబాటు చర్యలతో పాటు సీనియర్ నేతలకుకూడా అవకాశాలు కల్పించడంపై నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. మరి ఎన్నికల నాటికి అందే నివేదికలను బట్టి నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.
👉 టీడీపీ లోపల ఏం జరుగుతోంది..? కార్యకర్తలకు దూరమవుతున్న నేతలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది పార్టీకి నష్టం చేస్తుందా..? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.