లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సానిటరీ ఇన్స్పెక్టర్
కాకినాడ, పెన్ పవర్, మార్చి 31:
కాకినాడ కార్పొరేషన్‌లో అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి సానిటరీ ఇన్స్పెక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 10వ సర్కిల్‌లో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది.ట్రేడ్ లైసెన్స్ పేరుతో వేధింపులుట్రేడ్ లైసెన్స్ మంజూరు విషయంలో ఓ వస్త్ర వ్యాపారి, రెస్టారెంట్ యజమానిని ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా వేధించినట్లు వెల్లడైంది. ఫైల్ ముందుకు కదలాలంటే లంచం తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు.వేధింపులు భరించలేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా,పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం సాయంత్రం లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. విచారణ కొనసాగింపునిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దాడి జిల్లాలో సంచలనంగా మారింది.ప్రజలకు పిలుపు
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కిషోర్ మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ ఘటనతో జిల్లాలోని ఇతర శాఖల్లో ఉన్న అవినీతిపరుల్లో ఆందోళన నెలకొంది.