గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 31: జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలోని కుమ్మరపెళ్లి గ్రామంలో ఇటుకల పండగను గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం పండుగ వాతావరణంతో కళకళలాడింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు పలువురు నాయకులు, ప్రముఖులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.జనసేన పార్టీ నాయకుడు ఊలం ఈశ్వర్ రావు కార్యక్రమానికి విచ్చేసి గ్రామస్తులతో కలిసి పండగను ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ ఐక్యత, సంప్రదాయాల పరిరక్షణపై ఆయన అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంతల గురు, వంతల బుజ్జిబాబు, కొర్ర చిన్నయ్య, కొర్ర పరమేశ్వరరావు, వంతల రామారావు, పాంగి చిరంజీవి, వంతల బాలకృష్ణ, వంతల బాలయ్య, కొర్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.