మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం ఇమ్మానుయేల్ స్కూల్ హాస్టల్ లో అగ్నిప్రమాదం
నర్సీపట్నం, పెన్ పవర్ :
అనకాపల్లి జిల్లా కొండల అగ్రహారం ఇమాన్యుయల్ స్కూల్ హాస్టల్ లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పిల్లలు హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా స్కూల్ యాజమాన్యం భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది