PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 5:52 pm Posted By : M CHANTI BABU

కోట్నాపల్లి గ్రామంలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ – 

పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 24:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీ కోట్నాపల్లి గ్రామంలో పాఠశాల విద్యార్థులకు వినూత్న కార్యక్రమం జరిగింది. జీకే వీధి పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు కుమార్తె హరిప్రియ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిసిసి మాజీ చైర్మన్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎం.వి.వి.ఎస్. ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి దిశగా ఈ చిన్న సహకారం అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు, జీకే వీధి మండల టిడిపి ఆర్గనైజేషన్ సెక్రటరీ మొట్టడం ఎం.వి.ఎస్.ఎన్ ప్రసాద్, పాంగి కృష్ణ, కుమారి, ఉపాధ్యాయులు వి. రాజు, కె. గణపతి తదితరులు పాల్గొన్నారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమం చేపట్టడం ద్వారా విద్యార్థులకు ప్రోత్సాహం లభించినట్లుగా స్థానికులు తెలిపారు.