కాజులూరు, పెన్ పవర్, మార్చి 26:
కాజులూరు మండల పరిధిలోని గొల్లపాలెం గ్రామ పంచాయతీ వారాంతపు సంత, డైలీ మార్కెట్లలో ఆసీల వసూళ్ల నిర్వహణకు గురువారం వేలంపాట నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి సీ.హెచ్. సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంపాటలో డిప్యూటీ ఎంపిడిఓ చక్రపాణి పాల్గొని రెండు విభాగాలుగా వేలం నిర్వహించారు.గ్రామానికి చెందిన పలువురు పోటీపడగా, కట్టా శ్రీను వారాంతపు సంత ఆసీల వసూళ్లకు రూ. 1,30,000లకు హెచ్చుధరకు పాట దక్కించుకోగా, మాత నాగారాజు డైలీ మార్కెట్లలో ఆసీల వసూళ్లకు రూ. 3,01,000లకు హెచ్చుధరకు పాట దక్కించుకున్నారు.గత ఏడాది మొత్తం ఆసీల వేలంపాట రూ. 3.96 లక్షలకు ముగియగా, ఈ ఏడాది రూ. 4.31 లక్షలకు పెరిగినట్లు డిప్యూటీ ఎంపిడిఓ చక్రపాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు ప్రసన్నమౌనిక,ఉపసర్పంచ్ తాడి భువనేశ్వరీ దేవి,మాజీ సర్పంచ్ పోతురాజు బాబూరావు,జొన్నకూటి వెంకటేశ్వరరావు, పులివెల రాజు, అంగర శ్రీను,పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు