వి.ఆర్.పురం పెన్.పవర్.మార్చి.8
మండలంలోని రేఖపల్లి,మండల ప్రజాపరిషత్,కార్యాల యం ప్రాంగణం నుండి రేఖపల్లి,జంక్షన్ వరకు మహిళలు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం మహిళలు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపు కున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభలో ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ జిల్లా సహాయక కార్య దర్శి విజయ గౌరీ,జి.సీ.డి.వో.కవిత, ఐద్వా రాష్ట్ర నాయ కులు రమణి,డాక్టర్ నీలుఫర్,సీడీపీఓ మల్లిక,పాల్గొని వా రు మాట్లాడుతూ,ఆడపిల్లలకు సామా జికంగా సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నో చట్టాలు వచ్చా యని,గుర్తు చేశారు.దశాబ్దాలు గడుస్తున్నా మనదేశంలో సామా జిక, సాంస్కృతిక కట్టుబాట్లు మహిళల ఎదుగు దలకు సంకెళ్లు గా మారుతున్నాయని,ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యం గా వ్యవసాయ రంగంలో పురుషులతో సమానంగా శ్రమి స్తున్న మహిళలకు నేటికీ ‘రైతు’అనే గుర్తింపు దక్కక పో వడం శోచనీయమన్నారు.రక్షణ కరు వైన వేళ, ప్రాధాన్యత పెరగాలని,సమాజంలో మహిళలకు సరైన ప్రాధాన్యత, గౌరవం దక్కకపోవడం వల్లే నేటికీ మహిళా రక్షణ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని,వక్తలు అభి ప్రాయపడ్డారు. కేవలం చట్టాల వల్ల మార్పురాదని,పురుషుల ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన రక్షణ లభిస్తుందని,పేర్కొన్నారు.నిర్ణయాధికారాల్లో మహి ళల భాగస్వామ్యం పెరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని, స్పష్టంచేశారు.డ్రగ్స్ రహిత సమాజం దిశ గా అడుగులు ప్రస్తుత సమాజంలోయువత డ్రగ్స్ మరి యు చెడు అల వాట్లకు బానిసలవుతుండటంపట్ల సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.మత్తు పదార్థాల వల్ల అటు యువత భవి ష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా,గృహాలలోని మహి ళలు శారీరక,మానసిక వేధింపులకు గురవు తున్నారు. డ్రగ్స్ మహమ్మారి నుండి సమాజాన్నివిముక్తి చేసేందుకు ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని,మహిళలు చైతన్య వంతులై పోరాడాలని పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో స్థానిక మహిళా సం ఘాల ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు,మహిళ లు అధిక సంఖ్యలోపాల్గొని,తమ నిరసనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఎంపీపీ కారంలక్ష్మి,రేఖప ల్లి సర్పంచ్,పూనెం సరోజిని,పెద్దమట్టపల్లి సర్పంచ్,వెట్టి లక్ష్మి,ఎం.పీ టీ.సీ. ప్రదీప్,కుమార్,యుటిఎఫ్ నాయకులు సోడి నాగేశ్వరరావు,నూనె రామకృష్ణ,బాబు,సున్నం చంద ర్రావు,రాజు,నూనె జగదీష్,సిపిఎం నాయకులు జిల్లా కమి టీ సభ్యులు సోయం చిన్నబాబు,మండల కార్యదర్శివర్గ సభ్యులు పంకు సత్తిబాబు,మండలనాయకులు పోడియం శ్రీరా మ్మూర్తి,గుండిపూడి లక్ష్మణరావు,కమ్మ చిచ్చు సత్య నారాయణ,సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.రాజేశ్వరి,జి ల్లా కమిటీ సభ్యులు సున్నం రంగమ్మ,గొర్రె రాజు,రమాదే వి,నూతన,కనక మహాలక్ష్మి,రాములమ్మ,వర లక్ష్మి,వివిధ సంఘాలనాయకులు,మహిళలు తదితరు లుపాల్గొన్నారు.