PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 6:20 pm Posted By : DURGARAO P

ఘనంగా రంజాన్‌ వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు,

 

ప్రత్యేక ప్రార్థనలు, పరస్పర శుభాకాంక్షలతో సందడి

సీతానగరం, పెన్ పవర్, మార్చి 21:

సీతానగరం మండలంలోని, సింగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మసీదుల్లో ప్రత్యేక నమాజ్‌ నిర్వహించి అల్లాహ్ కు ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్‌ నెల ముగిసిన సందర్భంగా జరుపుకునే ఈద్‌ పండుగను గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ”ఈద్‌ ముబారక్‌” అంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గ్రామంలో సామరస్య వాతావరణంలో ఈ వేడుకలు కొనసాగాయి. పెద్దలు యువతకు ఐక్యత, సహనం, దాతృత్వం వంటి విలువలను వివరించారు. రంజాన్‌ పండుగ ద్వారా సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందుతుందని గ్రామ గ్రామాల్లో ఉన్న పెద్దలకు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇమామ్ మౌజన్లకు పదివేల రూపాయలు మోజులకు ఐదువేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం చెల్లిస్తుందని 2025 అక్టోబర్ నుండి 2026 మార్చి వరకు వారికి ఆరు నెలల బకాయిలు ఉండగా మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం విడుదల చేసిందని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఎమ్ డి.ఫరూక్ సింగవరం మసీద్ ఈ కౌరప్ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా షరీఫ్ రాజు, షేక్ నాగూర్ మీరా సాహెబ్, షేక్ షేలాద్ సాహెబ్, షేక్ మస్తాన్ వలి, షేక్ రెస్మాన్, సింగవరం గురువు ఉమర్, షేక్ సాయి, షేక్ సలీమ్, షేక్ ఖాసీం సాహెబ్, షేక్ ఉమర్, షేక్ బుల్ మీరా, షేక్ సుభాని, తదితరులు పాల్గొన్నారు.