PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:36 pm Posted By : PEN POWER MEDIA

చందనోత్సవ ఏర్పాట్లు సిద్ధం ..

  • చందనోత్సవం తేదీ ఖరారు
  • మంత్రి స్వామి సమీక్ష సమావేశం
  • ఎమ్మెల్యేలు, కలెక్టర్ సమీక్ష
  • భక్తుల పెద్దపీటలు ఏర్పాటు
  • అన్నిశాఖల సిబ్బంది సమన్వయం
  • టికెట్ల జారీ: మూడు రోజులు ముందుగా
  • వాహన పాసులు & డ్యూటీ పాసులు జాగ్రత్త
  • వేర్వేరు క్యూలైన్‌లు
  • రూ. 1500 టికెట్ ప్రత్యేక దర్శనం
  • భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు
  • సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న
  • ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష
  • QR కోడ్ & స్లాట్ వివరాలతో టికెట్లు ముందస్తుగా జారీ

న్యూస్ డెస్క్ పెన్ పవర్, మార్చి 26:

చందనోత్సవం (ఏప్రిల్ 20) కోసం ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకూ తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి స్వామి సూచించారు. సాధారణ భక్తుల కోసం పెద్దపీటలు ఏర్పాటు చేయాలని, అన్నిశాఖల అధికారులు మరియు సిబ్బంది సమన్వయం కచ్చితంగా పాటించలని ఆదేశించారు. 

సింహాచలం లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న జరగనుంది.. ఆలయంలో ఏర్పాట్లపై ముందుగానే ప్రభుత్వం దృష్టిపెట్టింది. విశాఖపట్నం జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్ష చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు మంత్రి స్వామి. చందనోత్సవంలో సాధారణ భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 17నాటికి చందనోత్సవం టికెట్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని.. వాహన పాసులు, డ్యూటీ పాసుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.చందనోత్సవానికి సంబంధించి దర్శనాల టికెట్ల విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. గతేడాది చందనోత్సవానికి సంబంధించి రాత్రి 11 గంటల వరకు భక్తులకు టికెట్లు ఇవ్వలేదన్నారు. ఈసారి మూడు రోజులు ముందుగా జారీ చేయాలని.. టికెట్ల లెక్క పక్కాగా ఉండాలన్నారు. కలెక్టర్, ఈవోల చేతుల మీదుగా టికెట్లు జారీ చేస్తే బావుంటుందని సూచించారు. అలాగే టికెట్లపై క్యూఆర్‌ కోడ్, స్లాట్‌ వివరాలు ఉండేలా చూడాలని కోరారు.చందనోత్సవం రోజు దర్శనాల కోసం వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కలెక్టర్ హరేంధిరప్రసాద్‌. రూ.300, రూ.1000, రూ.1500 దర్శన టికెట్లు ఉన్న భక్తులకు విడివిడిగా క్యూ లైన్లు ఉంటాయన్నారు. వీరిలో రూ.1500 టికెట్‌ ఉన్న భక్తులు మాత్రం భోగమండపం నుంచి స్వామిని దర్శించుకోవచ్చన్నారు. చందనోత్సవం రోజు అప్పన్నకు ముందుగా సుప్రభాత సేవ నిర్వహిస్తారని.. అనంతరం వ్యవస్థాపక ధర్మకర్తలకు తొలి దర్శనం ఉంటుందన్నారు.ఏపీ ప్రభుత్వం, టీటీడీ తరఫున అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని.. వేకువజామున 4.30 గంటల నుంచి వీఐపీ దర్శనాలకు అనుమతిస్తామన్నారు. అంతరాలయ దర్శనాలు కూడా ఉండవని వివరించారు. చందనోత్సవం కోసం వచ్చే భక్తుల కోసం కొండ దిగువన 50 ఆర్టీసీ బస్సుల్ని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. చందనోత్సవం కోసం అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం సీపీ శంఖబ్రతబాగ్చీ వివరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. చందనోత్సవానికి వచ్చే చిన్నారులకు ట్యాగ్‌లు అమలు చేస్తామన్నారు.