PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 2:37 pm Posted By : SRIKANTH NARASIMHALA

చిలకలూరిపేటలో పెట్రోల్ బంకుల తనిఖీ

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 26 :  

చిలకలూరిపేట : పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు సివిల్ సప్లైస్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి బంకుల్లోని నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా, బాటిళ్లు లేదా క్యాన్లలో పెట్రోల్ పోయడం పూర్తిగా నిషిద్ధమని, కేవలం వాహనాలకు మాత్రమే ఇంధనం నింపాలని స్పష్టం చేశారు. ఆసుపత్రులు, ఫైర్ స్టేషన్ మరియు పోలీసుల వంటి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి పత్రాల ఆధారంగా సరఫరా చేయాలని ఆదేశించారు. ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినా లేదా అక్రమంగా నిల్వ చేసినా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బంక్ యజమానులను అధికారులు హెచ్చరించారు