PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:00 pm Posted By : SRIKANTH NARASIMHALA

చిలకలూరిపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు ముగింపు – అధ్యక్షుడిగా పి. పురుషోత్తమ రావు విజయం

సెక్రెటరీగా తెల్లబాటి వినయ్ కుమార్ ఘన విజయం – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 30 : 

చిలకలూరిపేట : స్థానిక బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో పోలూరి పురుషోత్తమ రావు విజయం సాధించారు.

మొత్తం 116 ఓట్లు పోలింగ్ జరగగా, పురుషోత్తమ రావుకు 58 ఓట్లు లభించాయి. ఆయన తన సమీప ప్రత్యర్థి పి. శ్రీనివాసరావు (44 ఓట్లు)పై 14 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరో అభ్యర్థి టి. రామనారాయణకు 12 ఓట్లు రాగా, 2 ఓట్లు నోటా కు పడ్డాయి.

సెక్రెటరీ పదవికి జరిగిన ఎన్నికల్లో తెల్లబాటి వినయ్ కుమార్ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. వినయ్ కుమార్‌కు 77 ఓట్లు లభించగా, ఆయన ప్రత్యర్థి రాజ్‌కుమార్‌కు 39 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 58 ఓట్ల భారీ మెజారిటీతో వినయ్ కుమార్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు.

మొత్తం 122 ఓట్లకు గాను 116 ఓట్లు పోలింగ్ జరగడం గమనార్హం. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తోటి న్యాయవాదులు అభినందనలు తెలిపారు.